Ravi Babu, Poorna: ఆ కారణంతోనే పూర్ణతో మూడు సినిమాలు చేసాను : రవిబాబు

రవిబాబు… ఒకప్పుడు నటుడిగా విలక్షణమైన పాత్రలు చేసిన ఈయన తర్వాత ‘అల్లరి’ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆ చిత్రం హిట్ అవ్వడంతో తర్వాత ‘అమ్మాయిలు అబ్బాయిలు’ అనే అడల్ట్ కంటెంట్ కామెడీ సినిమా కూడా.వాటి ముచ్చట కూడా తీరాక ‘నచ్చావులే’ వంటి ప్రేమకథలు చేసి హిట్లు కొట్టాడు. కొన్నాళ్ళకు అవి కూడా కాదని వరుసగా సస్పెన్స్ థ్రిల్లర్లు, హారర్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉండగా.. రవిబాబు తెరకెక్కించిన సినిమాల్లో ఎక్కువగా కనిపించిన హీరోయిన్లు భూమిక, పూర్ణ లు..!

వరుసగా వీళ్ళతోనే సినిమాలు చేస్తూ వచ్చిన తరుణంలో రవిబాబుకి వాళ్ళతో ఎఫైర్స్ ఉన్నట్టు చర్చలు జరిగాయి. వీటి పై రవిబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘నేను ఎథిక్స్, వాల్యూస్ ఎక్కువగా నమ్మి, పాటించే వ్యక్తిని..! నేను షూటింగ్ కు ప్యాకప్ చెప్పిన తర్వాత ఏ ఒక్క హీరోయిన్ తో ముచ్చట్లు పెట్టిన సందర్భాలు లేనే లేవు. వాళ్ళనే కాదు షూటింగ్ స్టాఫ్, అసిస్టెంట్ డైరెక్టర్లు.. ఎవ్వరు ఫోన్ చేసినా ఫోన్లు లిఫ్ట్ చేయను.

షూటింగ్ టైం అయిపోయాక ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతాను. పూర్ణ వరుసగా నా మూడు సినిమాల్లో నటించిన మాట వాస్తవం. కేవలం ఆమె అభినయం కారణంగానే ఆమెను నా సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకున్నాను. నేను వెకిలి వేషాలు వేస్తే వాళ్ళు నా తర్వాతి సినిమాల్లో నటించడానికి ఇష్టపడతారా?’ అంటూ చెప్పుకొచ్చాడు రవిబాబు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus