‘ఓదెల 2’ (Odela 2) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో ఓపెనింగ్స్ ఓ మాదిరిగా వస్తున్నాయి. కానీ చిత్ర బృందం మాత్రం మా సినిమా సూపర్ హిట్. 3 రోజులకే రూ.6.25 కోట్లు కలెక్ట్ చేసింది అంటూ ఈరోజు ఓ సక్సెస్ మీట్ పెట్టుకుంది. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘ఓదెల 2’ సెకండాఫ్ లో కొన్ని మంచి సీక్వెన్స్ లు ఉన్నాయి. గ్రాఫిక్స్ వర్క్ వంటిది బాగుంది.
కానీ క్లైమాక్స్ లో విలన్ ను చంపడానికి స్వయంగా శివుడే దిగి వచ్చినట్టు చూపించారు. సరే అది మంచి ఆలోచనే. కానీ భైరవితో విలన్ ని అంతం చేసినా.. శుభం కార్డు పడే ముందు విలన్ సైకిల్ మళ్ళీ వచ్చినట్టు చూపించి షాకిచ్చారు. స్వయంగా శివుడే వచ్చి విలన్ ని అంతం చేసినా.. మళ్ళీ అతని ఆత్మ రావడం ఏంటి? శివుణ్ణి తక్కువ చేయడమే కదా ఇది అని కొందరు వాదిస్తున్నారు. ఇది ఎక్కడా హిందూ సంఘాల వరకు వెళ్లి వాళ్ళు కోర్టులు, నోటీసులు అంటారో అని భయపడ్డాడో ఏమో కానీ సంపత్ నంది క్లారిటీ ఇచ్చేశాడు.
సంపత్ నంది (Sampath Nandi) మాట్లాడుతూ… ” ‘ఓదెల 2′ క్లైమాక్స్ లో ”తిరుపతి’ ని సాక్షాత్తు శివుడే వధించిన తర్వాత మళ్ళీ సైకిల్ ఎలా వచ్చింది. అది శివుణ్ణి తక్కువ చేసినట్టే కదా మీరు. కనీసం చూసుకోరా’ అంటూ మమ్మల్ని కొంతమంది తిట్టారు. అందుకు నేను మీడియా ముఖంగా క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. వాస్తవానికి ఇది పార్ట్ 3 కోసం మేము రాసుకున్న లీడ్.
ఒక ట్విస్ట్ లాంటిది. కానీ బయట పెట్టక తప్పడం లేదు. వాస్తవానికి తిరుపతి కపాల మోక్షం జరిగితే.. అతని ఆత్మ ఇక రాదు. కానీ అతనికే కపాల మోక్షం జరిగింది అని మీరు ఎందుకు అనుకుంటున్నారు.? అక్కడ ఏం జరిగింది. ఆ కపాలం ఎవరిది? అనేది ఆ పరమాత్ముడు అవకాశం ఇస్తే.. 3వ భాగంలో చూద్దాం” అంటూ క్లారిటీ ఇచ్చాడు.