Sandeep Raj , Chandini Rao: ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

యూట్యూబ్లో సుహాస్ తో  (Suhas) పలు షార్ట్ ఫిల్మ్స్‌ డైరెక్ట్ చేసిన సందీప్ రాజ్ (Sandeep Raj)  వాటి ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. దాని ద్వారా ఇతనికి ‘కలర్ ఫోటో’ (Colour Photo)  సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆహా ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ని రాబట్టుకుంది. నేషనల్ అవార్డు కూడా కొట్టింది. తర్వాత సందీప్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఇటీవల నటి చాందినీ రావ్ తో (Chandni Rao)   సందీప్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈరోజు వారు సైలెంట్ గా పెళ్ళిపీటలెక్కారు.

Sandeep Raj , Chandini Rao

తిరుమలలో, శనివారం నాడు వీరి పెళ్ళి జరిగినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు.. బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్ళి వేడుకకు ఇండస్ట్రీ నుండి సుహాస్‌, వైవా హర్ష వంటి వారు హాజరయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వీరి ఫాలోవర్స్ తో పాటు కొంతమంది నెటిజన్లు ఈ కొత్త జంటకి తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తూ… ‘విష్ యు ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కలర్‌ ఫొటో’ సినిమాలో చాందినీ రావు ఓ ముఖ్య పాత్ర పోషించింది. షార్ట్ ఫిలిమ్స్ టైం నుండి వీరికి పరిచయం ఉంది. ‘కలర్ ఫోటో’ నుండి వీరి పరిచయం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం, ఫైనల్ గా పెద్దలను ఒప్పించి పెళ్ళిచేసుకున్నట్టు స్పష్టమవుతుంది.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus