Sandeep Raj, Chandini Rao: దర్శకుడు సందీప్ రాజ్, నటి చాందినీ..ల ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్!
- November 11, 2024 / 09:11 PM ISTByFilmy Focus
యూట్యూబ్లో సుహాస్ తో (Suhas) పలు షార్ట్ ఫిల్మ్స్ తీసి పాపులర్ అయ్యాడు సందీప్ రాజ్ (Sandeep Raj) . కొవిడ్ కి ముందు ఇతని దర్శకత్వంలో ‘కలర్ ఫోటో’ (Colour Photo) సినిమా మొదలైంది. కొన్ని కారణాల వల్ల అది ఆహా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. అలాగే నేషనల్ అవార్డు కూడా కొట్టింది. తర్వాత సందీప్ కి పలు ప్రొడక్షన్ హౌస్ల నుండి అడ్వాన్సులు అందాయి. అందులో ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ కూడా ఉంది. ఓ దశలో రవితేజతో (Ravi Teja) సినిమా ఫిక్స్ అనే ప్రచారం కూడా జరిగింది.
Sandeep Raj, Chandini Rao:

సందీప్ వద్ద ఓ క్రేజీ మల్టీస్టారర్ కి సరిపడా స్క్రిప్ట్ ఉంది. కానీ ఎందుకో అది ఇంకా సెట్ అవ్వలేదు. అయితే మరోపక్క అతను పలు వెబ్ ప్రాజెక్టులకు కూడా పనిచేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల అతను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి పాపులర్ అయిన నటి చాందిని రావుతో (Chandni Rao) సందీప్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడట.
కలర్ ఫోటో, హెడ్స్ అండ్ టేల్స్ వంటి ప్రాజెక్టుల్లో ఈమె చిన్న చిన్న పాత్రలు పోషించింది. పెద్దలను ఒప్పించి వీళ్ళు పెళ్ళికి రెడీ అయినట్లు తెలుస్తుంది. ఇక ఈరోజు సందీప్- చాందినీ..ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. కొద్దిపాటి బంధు మిత్రుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి :












