శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతో రిస్క్ చేస్తున్నారా..?

2021 సంవత్సరంలో హిట్టైన సినిమాలలో ఉప్పెన సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. కథ, కథనం రొటీన్ గానే ఉన్నా క్లైమాక్స్ ఈ సినిమా సక్సెస్ కావడానికి కారణమైంది. ఉప్పెన క్లైమాక్స్ లోని ఊహించని ట్విస్ట్ సినిమా రిలీజ్ కు ముందే అంచనాలను పెంచడంతో పాటు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. చావుకబురు చల్లగా సినిమాలో కూడా అలాంటి ప్రయత్నమే జరిగినా ఆ సినిమా కథ, కథనంలోని లోపాలు సినిమా ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి.

అయితే ఏప్రిల్ నెల 16వ తేదీన విడుదల కాబోతున్న లవ్ స్టోరీ సినిమాలో కూడా ఒక ఆడ్ పాయింట్ గురించి చర్చించారని ఒక బర్నింగ్ టాపిక్ తో శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన లవ్ స్టోరీ సినిమాలోని పాటలు ఇన్ స్టంట్ హిట్ కావడంతో పాటు సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచాయి. శేఖర్ కమ్ముల ఎంచుకున్న పాయింట్ క్లిక్ అయితే మాత్రం లవ్ స్టోరీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఫిదా తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని సాయిపల్లవి ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ట్రైలర్ విడుదలైతే లవ్ స్టోరీ సినిమా కథకు సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. వచ్చే నెలలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లవ్ స్టోరీ మూవీ శాటిలైట్, డిజిటల్ హక్కులు 16 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఈ సినిమా మొత్తం హక్కులు 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం. నాగచైతన్య కెరీర్ లోనే రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా లవ్ స్టోరీ నిలుస్తుండటం గమనార్హం. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాతో తన శైలికి భిన్నమైన సినిమా తీసి రిస్క్ చేస్తున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus