Shankar: రెండు పండుగలకు రెండు సినిమాలు.. శంకర్ డిసైడ్ అయితే సరిపొద్దా .. దిల్ రాజు ఏమంటాడు?

కమల్ హాసన్ తో శంకర్ ఇండియన్ 2 సినిమాని మొదలుపెట్టడం తర్వాత అనూహ్యంగా ఆ సినిమా సెట్లో ప్రమాదం చోటు చేసుకోవడం .. సినిమా కొన్నాళ్ళు ఆగిపోవడం.. నిర్మాతలైన లైకా వారితో శంకర్ కి గొడవ రావడం ..దీంతో శంకర్ ఆ ప్రాజెక్టు నుండీ బయటకు వచ్చేసి రాంచరణ్ తో సినిమా మొదలుపెట్టడం జరిగింది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. అయితే లైకా వారు ఈ శంకర్ పై కేసు వేయడం జరిగింది.

అయినా దిల్ రాజు మేనేజ్ చేసి తన సినిమాని స్టార్ట్ అయ్యేలా చేసుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండీ శంకర్.. దిల్ రాజుని హింసిస్తూనే ఉన్నారు. బడ్జెట్ ఆల్రెడీ మించిపోయింది. రకంగా రూ.70 కోట్లు ఎక్కువ ఖర్చు చేయించాడు శంకర్. టెక్నికల్ టీంను మార్చాడు. అయినా 60 శాతం మాత్రమే షూటింగ్ కంప్లీట్ అయ్యింది.మధ్యలో కమల్ హాసన్ రిక్వెస్ట్ మేరకు ఇండియన్ 2 షూటింగ్ ను మొదలుపెట్టాడు .

ఆ సినిమాని 3 వారాలు తీస్తూ, చరణ్ సినిమాని వారం రోజులు తీస్తూ వస్తున్నాడు శంకర్. ఇక ఈ చిత్రాల రిలీజ్ డేట్ లను కూడా ఫిక్స్ చేశాడు శంకర్. ఇండియన్2 ని 2023 దీపావళి కానుకగా రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాడట. ఇక చరణ్ సినిమాని 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

శంకర్ అనుకుంటున్నాడు సరే అందుకు దిల్ రాజు ఒప్పుకోవాలిగా..! దిల్ రాజు ప్రమేయం లేకుండా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తే ఆయన ధియేటర్లు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడాలి.2023 లో వారసుడు రిలీజ్ కు ఆయన పడ్డ ఇబ్బందులు అందరికీ తెలిసిందే.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus