పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 44 వ పుట్టినరోజును పురస్కరించుకుని హను రాఘవపూడి దర్శకత్వంలో అతను నెక్స్ట్ చేస్తున్న సినిమా నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు. ముందు నుండి ఈ సినిమాకి ‘ఫౌజి’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ నడిచింది. ఆ టైటిల్ కే ఆడియన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. మేకర్స్ మరో 2,3 టైటిల్స్ ను పరిశీలించినప్పటికీ.. జనాల్లోకి ఎక్కువగా ‘ఫౌజి’ వెళ్లడంతో అదే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయారు.
ఆ టైటిల్ తోనే ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు. ప్రభాస్ సినిమా కాబట్టి.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో మాస్ అప్పీల్ ఉంటుందని అభిమానులు ఆశించడం సహజం. కానీ ఈ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుడు హను రాఘవపూడి స్టైల్లో ఉంది. తగలబడుతున్న బ్రిటిషర్స్ జెండా. దాని వెనుక ప్రభాస్ పాత్రని కోపంగా చూపించడం. పోస్టర్లో ఎక్కువగా సంస్కృతం పదాలు కనిపించడం.
ఇవన్నీ కూడా దర్శకుడు హను రాఘవపూడి శైలిలో ఉన్నాయి. సినిమా కథ మూడ్ ని తెలియజేసే విధంగా ఈ పోస్టర్ ఉంది. ‘ఏ బెటా’లయన్’ హూ ఫైట్స్ ఎలోన్’ అనే క్యాప్షన్ ను బట్టి హీరో పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఆ పాత్ర యొక్క ధైర్య సాహసాలను తెలుపుతూ ఆ క్యాప్షన్ పెట్టి ఉండవచ్చు. ‘ఫౌజి’ తో ఇమాన్వి హీరోయిన్ గా డెబ్యూ ఇస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్..లు దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.