Kanguva: ‘కంగువ’ స్టోరీ లైన్‌ చెప్పేసిన దర్శకుడు… కథ అంతా ఐదు చుట్టే?

ప్రస్తుతం ఇండియన్‌ సినిమాలో ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు ‘కంగువ’ (Kanguva). సూర్య (Suriya) – శివ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా గురించి అంతగా బజ్‌ ఉంది. అంతగా మాట్లాడుకుంటున్నారు. టీమ్‌ చెబుతున్నదంతా తెర మీద కనిపించి, ఆకట్టుకుంటే త్వరలో ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుతుంది అని చెప్పొచ్చు. ఈ నెల 14న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా గురించి, కథ గురించి దర్శకుడు శివ (Siva)  కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

Kanguva

ప్రజల్లో ఇప్పుడున్న ఎమోషన్స్‌ వెయ్యేళ్ల క్రితం మనుషుల్లో ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుండి ‘కంగువ’ కథ పుట్టిందట. ఐదు దీవులు, ఐదు వంశాల చుట్టూ సాగే కథ ఇది అని శివ చెప్పారు. సైన్స్‌ ఫిక్షన్, మిస్టిక్‌ అంశాలతో తెరకెక్కిన ఈ కథ పూర్తిగా కల్పితం అని, అయితే లార్జర్‌ దేన్‌ లైఫ్‌ తరహాలో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు వచ్చిన పీరియాడిక్‌ కథలకు దీనికి ఎలాంటి పోలిక ఉండదు అని కూడా చెప్పారు.

యోధులు బయట ప్రత్యర్థులతో ఒక యుద్ధం చేస్తుంటే, లోపల మరో యుద్ధం చేస్తుంటారు. ఆ విషయాన్నే ఈ సినిమాలో చూపిస్తున్నాం. రెండు టైమ్‌ జోన్స్‌లో సాగే ఈ కథలో కంగువ అనే వెయ్యేళ్ల కిందటి వీరుడిగా ఒక పాత్రలో.. నేటి తరం ఫ్రాన్సిస్‌ మరో పాత్రలో సూర్య కనిపిస్తాడు. వెయ్యేళ్ల క్రితం కంగువ ఇచ్చిన మాట ఏమిటి? దానిని నిలబెట్టుకోవడానికి ఎంతటి సాహసం చేశాడనేది సినిమాలో కీలకాంశం.

ఇక ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉంటుందని కొన్ని రోజుల క్రితమే చెప్పిన శివ.. అందులోని ఓ స్పెషల్‌ ఎలిమెంట్‌ గురించి కూడా చెప్పారు. రెండో భాగంలో అందరూ ఆశ్చర్యపోయేలా ఓ అతిథి పాత్ర ఉంటుందని చెప్పారు. ఆ పాత్రని ఎవరు చేశారనేది తెరపైనే చూడాలి అని సస్పెన్స్‌ పెట్టారు. తొలి పార్టు చివర్లో ఐదు ప్రశ్నలు వస్తాయని.. వాటికి జవాబే రెండో పార్టు అని చెప్పారు. అలా సినిమా ‘ఐదు’ చుట్టూ తిరుగుతుందన్నమాట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus