బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్వయంకృషితో భారీ సక్సెస్ లను చిరంజీవి సొంతం చేసుకున్నారు. 150కు పైగా సినిమాల్లో చిరంజీవి నటించగా ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో పాటు చిరంజీవి హీరోగా నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాయి. అయితే చిరంజీవి ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టం అంతాఇంతా కాదు. ప్రాణం ఖరీదు సినిమా షూటింగ్ పూర్తైన తరువాత ఆ సినిమాలోని చిరంజీవి పాత్రకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించాలని నిర్మాత క్రాంతికుమార్ భావించారు.
ఈ విషయం తెలిసిన చిరంజీవి నిర్మాత ఆఫీస్ ముందు కూర్చుని తానే డబ్బింగ్ చెబుతానని డబ్బింగ్ నచ్చకపోతే అప్పుడు మార్చమని నిర్మాతను భయంభయంగా అడిగారు. ఆ తరువాత సంకల్ప బలంతో డబ్బింగ్ పూర్తి చేసి చిరంజీవి డబ్బింగ్ ను ఓకే చేయించుకున్నారు. స్పీడ్ గా డ్యాన్స్ చేయడం కొరకు చిరంజీవి ఎంతో కష్టపడ్డారు. జ్వాల సినిమా క్లైమాక్స్ ఫైట్ సమయంలో రిఫ్లెక్టర్స్ వల్ల చిరంజీవి వీపు భాగమంతా కందిపోయింది.
జ్వాల సినిమా చివరి రోజు షూటింగ్ లో రెయిన్ ఎఫెక్ట్ కొరకు తెప్పించిన వాటర్ అయిపోగా చిరంజీవి కొలనులో ఉన్న పాచిపోయిన నీళ్లను తీసుకొనిరమ్మని సెట్ అసిస్టెంట్లకు చెప్పారు. ఆ తర్వాత ఆ నీటిని వర్షంలా తనపై పడేలా చేయమని చిరంజీవి వాళ్లకు సూచించారు. ఈ విధంగా ఎన్నో కష్టాలు పడి, రిస్క్ లు చేసి చిరంజీవి ఈ స్థాయికి చేరుకున్నారని ప్రముఖ దర్శకులలో ఒకరైన శివ నాగేశ్వరరావు చెప్పారు.