శ్రీను వైట్ల (Srinu Vaitla) సినిమా అంటే మినిమమ్ ఉంటుంది అనే స్థాయి నుండి.. ‘శ్రీను వైట్ల సినిమానా?’ అనే ప్రశ్న వేసే స్థాయి వచ్చేసింది. దానికి కారణం ఇటీవల వరకు ఆయన నుండి వచ్చిన సినిమాలు దాదాపు ఒకే ఫార్ములాతో ఉండటం. అయితే ‘విశ్వం’ (Viswam) సినిమాతో కాస్త ట్రాక్ మార్చారు అని అర్థమైంది. అయితే సినిమాకు ఆశించిన విజయం అయితే రాలేదు. ఈ నేపథ్యంలో శ్రీను వైట్ల నుండి కొత్త ఇప్పట్లో కష్టమే అని వార్తలొచ్చాయి.
కానీ, శ్రీను వైట్ల ఆలోచనలు వేరేలా ఉన్నాయి. ఆయన కొత్త సినిమా స్టార్ట్ చేయడానిక ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. దర్శకుడిగా పాతికేళ్లు పూర్తి చేసుకున్న శ్రీను వైట్ల తన స్పెషల్ టైమ్‌నాడు కొత్త సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇకపై కథల్లో కొత్తదనం, వైవిధ్యం ఉంటేనే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నా అని చెప్పారు. ఓ కొత్త కుర్రాడు ఇచ్చిన కొత్త రకమైన కథతో సినిమా చేయబోతున్నా అని చెప్పారు.
పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నామని, కచ్చితంగా ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఇప్పటికే 70 శాతం కథ సిద్ధమైందని, త్వరలో నటీనటులు, ఇతర వివరాలు ప్రకటిస్తామని చెప్పారు. నిజానికి ‘విశ్వం’ సినిమాకే కొత్త కామెడీ రాశాను అని చెప్పారు శ్రీను వైట్ల. ఇప్పుడు మరోసారి కొత్త సినిమా అంటున్నారు. ఇండస్ట్రీలోకి శ్రీను వైట్ల ఎంట్రీ ఇచ్చిన ‘నీ కోసం’ (Nee Kosam) గురించి చెబుతూ.. దర్శకుడు అవ్వాలన్న లక్ష్యంతో చిన్న వయసులోనే చెన్నైకు వెళ్లిపోయానని, ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ‘నీకోసం’తో దర్శకుడిగా మారానని చెప్పారు.
రవితేజ (Ravi Teja) టాలెంట్‌పై తనకు నమ్మకం ఉందని చెప్పిన ఆయన.. అందుకే ఈ కథను తనతోనే చేయాలని అనుకున్నానని చెప్పారు. అయితే ఆ సినిమా కంటే ముందు ఓ సినిమా స్టార్ట్ చేశామని, కొన్నాళ్ల షూటింగ్ తర్వాత అది ఆగిపోవడంతో బాధపడ్డానని చెప్పారు శ్రీను వైట్ల. ఆ సినిమా చాలామంది చేతులు మారి చివరకు రామోజీరావు (Ramoji Rao) చేతికి వెళ్లిందని చెప్పారు. ఆ సమయంలో ఆయన మాట ఇచ్చినట్లే.. రెండో సినిమా అవకాశాన్ని ‘ఆనందం’ ద్వారా ఇచ్చారని శ్రీను వైట్ల గుర్తు చేసుకున్నారు.