Sujeeth: ఓజీ షాకింగ్ సీక్రెట్స్ చెప్పేసిన సుజీత్.. ట్రైలర్ రెడీ అంటూ?

ఈ ఏడాది విడుదల కానున్న క్రేజీ సినిమాలలో ఓజీ (OG Movie) ఒకటి కాగా ఈ సినిమా సెప్టెంబర్ నెల 27వ తేదీని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకుంది. ఆ సమయానికి ఈ సినిమా విడుదలవుతుందో లేదో అనే కన్ఫ్యూజన్ అభిమానులను వెంటాడుతోంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రెండు వారాల డేట్స్ కేటాయిస్తే ఓజీ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన షూట్ పూర్తవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. తాజాగా సుజీత్ (Sujeeth) మాట్లాడుతూ ఓజీ సినిమాకు సంబంధించి షాకింగ్ సీక్రెట్స్ వెల్లడించగా ఆ విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఓజీ టైటిల్ లో ఓజాస్ అంటే మాస్టర్ పేరు అని గంభీర్ అంటే హీరో అని సుజీత్ అన్నారు. రెండూ కలిపితే ఓజీ వస్తుందని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తన సినిమాలలో జపాన్ ఫ్లేవర్ చూపించే ప్రయత్నం చేస్తారని అందువల్లే జపాన్ స్టైల్ లో పవన్ తో సినిమా తీయాలని భావించి ఓజీ తీస్తున్నానని సుజీత్ అన్నారు. మొదట ఒక రీమేక్ కోసం నన్ను పిలిచారని పవన్ తో రీమేక్ చేయడం నాకు ఇష్టం లేదని ఆయన తెలిపారు.

ఆ తర్వాత పవన్ కొత్త కథ ఉందా అని అడగడంతో ఒక లైన్ చెప్పానని ఆ లైన్ తో ఓజీ తెరకెక్కుతోందని సుజీత్ పేర్కొన్నారు. తనకు జపాన్ సినిమాలు అంటే ఇష్టమని సుజీత్ అన్నారు. ఓజీ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా సిద్ధమైందని ఆయన వెల్లడించడం గమనార్హం. చెప్పిన తేదీకి దసరా పండుగ కానుకగా ఓజీ మూవీ విడుదలైతే మాత్రం అభిమానుల సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.

ఓజీ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఓజీ సినిమా రిలీజ్ కోసం అభిమానులు మాత్రం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus