Sukumar: సుకుమార్ డైరీ పదేళ్లపాటు ఫుల్!

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు సుకుమార్. గతేడాది విడుదలైన ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన చేతినిండా బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘పుష్ప2’తో బిజీగా ఉన్నారు. ఆ మాటకొస్తే మరో పదేళ్ల వరకు సుకుమార్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. ‘పుష్ప’ సినిమాకి ఎలా లేదన్నా.. మరో ఏడాది సమయం పడుతుంది. ఆ తరువాత ప్రభాస్ తో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు.

దీనికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. ఆ వెంటనే రామ్ చరణ్-సుకుమార్ సినిమా ఉంటుంది. ‘రంగస్థలం’ తరువాత రామ్ చరణ్ తో మరో సినిమా తీయాలని భావిస్తున్నారు సుకుమార్. రామ్ చరణ్ కి కూడా సుక్కుతో పని చేయాలనుంది. ఇటీవల వీరిద్దరి మధ్య చర్చలు కూడా నడిచాయి. ప్రభాస్ తో సినిమా అవ్వగానే.. రామ్ చరణ్ గా రెడీగా ఉంటారు. ఈ రెండు సినిమాల తరువాత ‘పుష్ప3’ కూడా ఉంటుందని సమాచారం.

‘పుష్ప3’ ఐడియాలజీ రీసెంట్ గానే పుట్టింది. దీనికి సంబంధించిన లైన్ కూడా బన్నీకి చెప్పారు సుకుమార్. చరణ్, ప్రభాస్, ‘పుష్ప3’ ఈ మొత్తం ప్రాజెక్ట్స్ పూర్తి కావడానికి కనీసం ఆరేళ్ల సమయం పడుతుంది. సినిమా సినిమాకి మధ్యలో గ్యాప్ తీసుకుంటే పదేళ్ల వరకు సుకుమార్ మరో సినిమా చేసే ఛాన్స్ ఉండదు. మధ్యలో సినిమాలు చేయాలనుకుంటే తన జోరు పెంచాలి.

కానీ ఇప్పుడు సుకుమార్ తీరు చూస్తుంటే ఆయన వేగంగా సినిమాలు చేసేలా కనిపించడం లేదు. ‘పుష్ప2’ కోసమే ఆయన చాలా సమయం తీసుకుంటున్నారు. నిజానికి ఈపాటికే సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తి కావాల్సింది. కానీ ఇప్పటివరకు సరైన షెడ్యూల్ ఒక్కటి కూడా జరగలేదు. దీంతో సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అయ్యేలా లేదు. ‘పుష్ప’ పార్ట్ 1కి మించి పార్ట్ 2ని నిర్మించబోతున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus