Dasara Movie: శిష్యుడి సినిమాపై సుకుమార్‌ ప్రశంసలు.. ఏమన్నారంటే?

నాని ‘దసరా’ సినిమా గురించి టాలీవుడ్‌ చాలా ఆనందంగా ఉంది. నానికి మంచి హిట్‌ పడటం ఒక ఆనందమైతే, టాలీవుడ్‌ నుండి మరో భారీ హిట్‌ రావడం ఇంకో ఆనందం. అయితే వీటితోపాటు సుకుమార్‌ మరో శిష్యుడు బయటకు వచ్చి మంచి హిట్‌ కొట్టడం. సుకుమార్‌ శిష్యులా మజాకా అంటూ.. ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. తనదైన సినిమాలు తీసే సుకుమార్‌.. అతని శిష్యులు మంచి సినిమాలు తీసినప్పుడు మెచ్చుకుంటూ ఉంటారు. తాజాగా ‘దసరా’ చూసి అలానే మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

నాని, కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించినచిత్రం ‘దసరా’ (Dasara) . పాన్‌ ఇండియా మూవీగా ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూల్లు అందుకుంటోంది. తన శిష్యుడు శ్రీకాంత్‌ ఓదెల పనితనాన్ని చూసిన సుకుమార్‌ తన ఆనందాన్ని దాచుకోలేకపోయారు. ‘‘దసరా’ సినిమా చూసిన తర్వాత నా హృదయం ఎంతో సంతోషం, గర్వంతో నిండిపోయింది. నా ప్రియమైన శ్రీకాంత్‌ ఓదెల సృష్టించిన వీర్లపల్లి ప్రపంచంలోకి నన్ను తీసుకెళ్లాడు’’ అంటూ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు సుకుమార్‌.

‘‘శ్రీకాంత్‌ విజువల్‌ నరేషన్‌ నా మతి పోగొట్టింది. ధరణి పాత్రలో నాని లీనమవడం బాగుంది. అతని నైపుణ్యంతో ఎప్పుడూ నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాడు. వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్‌ పరకాయప్రవేశం చేసింది. సూరి పాత్రలో దీక్షిత్‌ శెట్టి అదరగొట్టాడు. ఈ సినిమా విజయంలో పాలుపంచుకున్న నటులు, టెక్నీషియన్లు, సిబ్బందికి నా అభినందనలు. ‘దసరా’ చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు’’ అని సుకుమార్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

మార్చి 30న విడుదలైన ‘దసరా’ సినిమా గురించి అప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. పాత్రల లుక్‌, ప్రచార చిత్రాలు, ట్రైలర్‌, పాటలతో సినిమాపై బజ్‌ బాగుంది. అనుకున్న రీతిలో ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 80 కోట్లకు రాబట్టింది. శ్రీకాంత్‌ తన గురువును కొన్ని సన్నివేశాల్లో గుర్తు చేశారు అని ప్రశంసలు వచ్చిన నేపథ్యంలో సుకుమార్‌ మాటలు ఆయనకు మరింత కిక్‌ ఇస్తాయి అని చెప్పొచ్చు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus