ఈరోజు ‘సీతా పయనం’ టీజర్ లాంచ్ వేడుక జరిగింది. యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun Sarja) డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ‘శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్ పై అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఉపేంద్ర (Upendra Rao) అన్న కొడుకు నిరంజన్ ఈ చిత్రంలో హీరో. టీజర్ లాంచ్ కు గెస్ట్ గా సుకుమార్ (Sukumar) హాజరయ్యాడు. ఈ క్రమంలో అర్జున్ ‘హనుమాన్ జంక్షన్’ రోజులను గుర్తు చేసుకున్నారు.
ఆ సినిమాకు ఆయన అసోసియేట్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. అతని మార్క్ స్పీచ్ ఈ ఈవెంట్ కి హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. ముఖ్యంగా ఉపేంద్రని సుకుమార్ ఎలివేట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సుకుమార్ మాట్లాడుతూ.. “ఫ్రాంక్ గా చెప్పాలి అంటే.. ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత ‘ఓం’ ‘ఎ'(A) ‘ఉపేంద్ర’ ఈ 3 సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చు. నేను కనుక అలాంటి 3 సినిమాలు తీస్తే రిటైర్ అయిపోయేవాడిని.
అంత కల్ట్ మూవీస్ అవి. అలాంటి సినిమాలు మాకు ఇచ్చారు. మీరు నమ్మరేమో.. ఆ 3 సినిమాల తర్వాత అందరూ ఇన్స్పైర్ అయ్యారు. ఇవాళ నా స్క్రీన్ ప్లే ఇలా ఉంది అంటే దానికి కారణం.. ‘ఎ'(A) ‘ఉపేంద్ర’ ‘ఓం’ అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయడం ఉపేంద్ర గారికి అలవాటు. ఆ విషయాన్ని నేను మీ వద్ద నుండి దొంగిలించాను. తస్కరించాను. ఏమైనా అనుకోవచ్చు. సో మీరు నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్” అంటూ ఉపేంద్రని ఆకాశానికెత్తేశాడు.
ఉపేంద్ర తీసిన సినిమాలు నేను తీసి ఉంటే.. రిటైర్ అయిపోయేవాడ్ని
నా స్క్రీన్ ప్లేకి ఇన్స్పిరేషన్ ఉపేంద్ర సినిమాలు#SeethaPayanam #AishwaryaArjun #Arjun #Upendra #Sukumar pic.twitter.com/DWALL12ylH
— Filmy Focus (@FilmyFocus) May 28, 2025