గతేడాది ఆఖరులో వచ్చి దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన చిత్రం ‘పుష్ప’. తొలుత టాలీవుడ్ సినిమా వచ్చిన చిత్రం.. ఆ తర్వాత బాలీవుడ్‌లో సంచలనాలు సృష్టించింది. అయితే ఈ సినిమా మీద ఆ మధ్య దర్శకుడు తేజ కొన్ని వివాదాస్పద కామెంట్లు చేశారు. ‘పుష్ప’ సినిమాను అందరూ హిట్ అనుకొంటున్నారని, అయితే లాభాలు రాలేదని అన్నారు. అక్కడితో ఆగకుండా.. అందరూ యావరేజ్ అంటున్న‘రాధేశ్యామ్’కి లాభాలొచ్చాయి అన్నారు. ‘పుష్ప’, ‘రాధేశ్యామ్’ ఫలితాలపై ఆయన చెప్పిన లెక్కలకు ఓ థియేటర్‌లోని వసూళ్లను ఉదాహరణగా చూపించారు కూడా.
దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తేజపై ఓ రేంజ్‌లో చెలరేగిపోయారు. ‘పుష్ప’ సినిమాను ఫ్లాప్ అని ఎలా అంటారు అంటూ ప్రశ్నించారు. ట్రోలర్స్ సంగతి చెప్పక్కర్లేదు కదా చిన్న విషయానికే అంతెత్తున విరుచుకుపడే ట్రోలర్లు.. ‘పుష్ప’ సినిమాను అలా అనేసరికి ఇంకా రెచ్చిపోయారు. అయితే దీనిపై తేజ మరో ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ‘పుష్ప’ విడుదల సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయి.
అందుకే దానికి రావాల్సిన అంత రేంజిలో వసూళ్లు రాలేదు. అయితే మరో యావరేజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్లు పెంచేశారు. దాంతో ఆ యావరేజ్ సినిమాను కొన్నవాళ్లకు డబ్బులు మిగిలాయి. కానీ టికెట్ రేట్లు తక్కువ ఉండటం వల్ల ‘పుష్ప’ సినిమాకు రావాల్సిన వసూళ్లు రాలేదు. టికెట్ రేట్లు పెంచడం వల్ల ఓ యావరేజ్ సినిమా హిట్టయ్యింది అని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తనకు ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ అంటే చాలా ఇష్టమని చెప్పిన తేజ…
సుకుమార్ ఏం తీసినా నచ్చేస్తుందని అని చెప్పారు. ‘‘ఓ సినిమా హిట్టూ, ఫ్లాపుల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. ఎందుకంటే నేను తీసిన సినిమాలన్నీ హిట్ కాలేదు. ఫ్లాప్ కూడా కాలేదు. అందుకే నేను ఈ విషయాలు మాట్లాడకూడదు’’ అని వివరణ ఇచ్చారు. మరి దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూల్ అవుతారా? లేదా అదే స్థాయిలో విరుచుకుపడతారో చూడాలి.
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!