టాలీవుడ్ దర్శకుడు తేజ మీడియాకి కాస్త దూరంగా ఉంటారు. ఏమైనా ఇంటర్వ్యూలు ఇస్తే మాత్రం సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేసిన ‘అహింస’ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. రీసెంట్ గా ఆయనొక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తన సినిమా హీరో దగ్గుబాటి అభిరామ్ పై తేజ కొన్ని కామెంట్స్ చేశారు. అభిరామ్ ను డెబ్యూ హీరో అని జర్నలిస్ట్ సంబోధించడం తేజకి నచ్చలేదు.
వెంటనే.. అతడిని డెబ్యూ హీరో అని ఎలివేట్ చేయొద్దు. నా కథలో ఉన్న 20 క్యారెక్టర్స్ లో అభిరామ్ కూడా ఒక క్యారెక్టర్ అంతే అంటూ చెప్పుకొచ్చారు. తను ఉదయ్ కిరణ్, నితిన్ కి పరిచయం చేసినప్పుడు ఏమైనా గట్టిగా చెప్పుకున్నామా..? లేదు కదా.. మరి ఇతడి ఎందుకు మీరు అలా పోలుస్తూ ఎక్స్ట్రా చేస్తున్నారని అడిగారు తేజ. అభిరామ్ ని మామూలుగానే చూడండి అని చెప్పారు. తను అనుకున్న కథకు అభిరామ్ సరిపోయాడు అంతే.. అని చెప్పుకొచ్చారు తేజ.
సాధారణంగా ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరోపై డైరెక్టర్ ఇలా కామెంట్స్ చేయడం ఎక్కడా జరగదు. కానీ తేజ తను అనుకున్నది మొహమాటం లేకుండా చెప్తుంటారు. అందుకే అభిరామ్ ని హీరోగా కాకుండా ఒక క్యారెక్టర్ లా చూడాలని చెబుతున్నారు. అభిరామ్ తో సినిమా చేయడానికి మెయిన్ రీజన్ రామానాయుడు గారని.. ఆ విషయం రిలీజ్ కి ముందు తప్పకుండా చెప్తానని అన్నారు. సినిమాలో పదహారు యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు అన్ని ఉంటాయని..
మాస్ మసాలా సినిమాగా తెరకెక్కించామని అన్నారు. ‘అహింస’ అనే సినిమాలో ‘జయం’ సినిమా పోలికలు ఉన్నాయనే కామెంట్ పై తేజ స్పందించారు. కొత్తగా కథలేం ఉండవని.. మొత్తం 14 కథలే ఉంటాయని.. చెప్పే స్టైల్ మారుతుందని అన్నారు.
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!