Teja, Rana: రానా – తేజ.. ఇది కాస్త రిస్కేమో..!

రానా – తేజ కాంబినేషన్లో ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. తేజ ఆ చిత్రంతో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. అయితే అటు తర్వాత అతను చేసిన ‘సీత’ ‘అహింస’ చిత్రాలు పెద్ద ఫ్లాప్స్ గా మిగిలాయి. అయినప్పటికీ రానా.. తేజ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. రిస్క్ అని తెలిసినా .. కొన్ని అతను ధైర్యంగా చేస్తుంటాడు. ఇది కూడా అలాగే అనుకోవాలి.

‘రాక్షస రాజు’ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందనుంది. వాస్తవానికి ఈ నెలలోనే ఆ మూవీ సెట్స్ పైకి వెళ్ళాలి. జూలై 5 న రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ఫార్మల్ లాంచ్ ప్లాన్ చేశారు. కానీ ఎందుకో అది డిలే అయినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ ప్రాజెక్టు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. (Rana) రానా – తేజ ల ‘రాక్షస రాజు’ ని రెండు పార్టులుగా తెరకెక్కించబోతున్నారట.

టాలీవుడ్లో ఆ ఫార్ములా కొత్తదేమీ కాదు. ‘బాహుబలి’ ‘పుష్ప’ ఇప్పుడు ‘బింబిసార’ అన్నీ రెండేసి పార్టులుగా ప్లాన్ చేసినవే.అది సక్సెస్ ఫుల్ ఫార్ములాగా కూడా మారిపోయింది. ఇక రానా – తేజ ల సినిమా కూడా రెండు పార్టులుగా రూపొందినా.. ‘పార్ట్ 1 ‘ కి ‘పార్ట్ 2 ‘ కి ఎక్కువ గ్యాప్ లేకుండా మూడు నెలల వ్యవధిలోనే విడుదల చేసే ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారట మేకర్స్.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus