Vasishta: ఆ సినిమాను మరిపించేలా విశ్వంభర.. వశిష్ట ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో విశ్వంభర టైటిల్ తో ఒక భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బింబిసార తర్వాత దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా వశిష్ట మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా రెండో సినిమాకే చిరంజీవిని డైరెక్ట్ చేస్తానని కలలో కూడా ఊహించలేదని వశిష్ట చెప్పుకొచ్చారు. ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వశిష్ట కామెంట్లు చేశారు.

జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ రిలీజైన సమయంలో నేను స్కూల్ లో చదువుతున్నానని ఆ సినిమా చూసి ఎంతో ఆశ్చర్యపోయానని చిరంజీవి అలాంటి స్వచ్చమైన ఫాంటసీ సినిమాలో నటించి 30 సంవత్సరాలు అవుతోందని వశిష్ట అన్నారు. అంజి పూర్తిస్థాయి ఫాంటసీ మూవీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 70 శాతం విజువల్ ఎఫెక్ట్స్ తో జగదేక వీరుడు అతిలోకసుందరి సినిమాను మించేలా ఈ సినిమా ఉండనుందని భోగట్టా.

పంచ భూతాలు, త్రిశూలశక్తి లాంటి అంశాలకు అధ్యాత్మికతను జోడించి ఈ సినిమాలో కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నామని వశిష్ట అన్నారు. వశిష్ట చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. వశిష్ట ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే తన రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. బింబిసార2 సినిమాను వశిష్ట తెరకెక్కిస్తారో లేక మరో దర్శకుడు తెరకెక్కిస్తారో తెలియాల్సి ఉంది.

మల్లిడి వశిష్ట (Vasishta) పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించి తన స్థాయిని మరింత పెంచుకుంటారని నెటిజన్లు ఫీలవుతున్నారు. చిరంజీవి త్వరలో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. చిరంజీవి భోళా శంకర్ తర్వాత నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. చిరంజీవి రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది. మెగాస్టార్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. చిరంజీవి రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది. చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus