టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడాల్లేకుండా స్టార్ హీరోల పారితోషికాలు భారీ స్థాయిలో పెరిగాయి. కరోనా తర్వాత ఓటీటీల హవా పెరగడంతో పెద్ద సినిమాల డిజిటల్ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది. స్టార్ హీరోల రెమ్యునరేషన్ల పెంపు వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని పరోక్షంగా వెట్రిమారన్ (Vetrimaaran) కామెంట్లు చేశారు. స్టార్ హీరోల పారితోషికాల పెంపు ఓటీటీలు సృష్టించిన మాయాజాలం అని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రస్తుత పరిస్థితిని థియేట్రికల్ బాక్సాఫీస్ ఫెయిల్ అనలేమని ఆయన పేర్కొన్నారు. ఇది ఓటీటీ సంస్థలు సృష్టించిన మాయాజాలం అని వెట్రిమారన్ తెలిపారు. కరోనా నాటి పరిస్థితులను ఓటీటీ సంస్థలు ఒడిసిపట్టాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఓటీటీ సంస్థలు రజనీకాంత్ (Rajinikanth) , విజయ్ (Vijay Thalapathy) సినిమాల డిజిటల్ హక్కులకు 120 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశాయని ఆయన పేర్కొన్నారు.
ఓటీటీల నిర్వాహకులు అలా చెప్పడంతో సినిమాల బడ్జెట్లను పెంచేస్తున్నారని కొన్ని నెలలకే ఓటీటీ సంస్థలకు తప్పు ఎక్కడ జరిగిందో అర్థమై మేము అంత చెల్లించలేమని చెబుతున్న పరిస్థితి నెలకొందని వెట్రిమారన్ కామెంట్లు చేశారు. అప్పటికే నిర్మాత సినిమాను భారీగా తీయాలని ఫిక్స్ అయ్యి ఉంటాడని ఆయన తెలిపారు. అప్పటికే రెమ్యునరేషన్లకు సంబంధించి అగ్రిమెంట్లు అయిపోతాయని వెట్రిమారన్ వెల్లడించారు.
అలాంటి సమయంలో ఓటీటీ వేదికలు వెనక్కు తగ్గితే నిర్మాతలు ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. వెట్రిమారన్ చేసిన కామెంట్లలో నిజం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వెట్రిమారన్ రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. వెట్రిమారన్ రాబోయే రోజుల్లో టాలీవుడ్ హీరోలపై దృష్టి పెట్టనున్నారని భోగట్టా. వెట్రిమారన్ సినిమాలు పరిమిత బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా కూడా సంచలనాలు సృష్టిస్తుండటం గమనార్హం. వెట్రిమారన్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.