కేవలం ఫోటోలు కోసమే పెళ్లి చేసుకుంటున్నారు!

బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన ఈ మధ్యకాలంలో వరుసగా వివాదాలలో చిక్కుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా నేటితరం పెళ్లిళ్ల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత కాలంలో యువతీ యువకులు పెళ్లి కేవలం ఫోటోలు దిగడం కోసమే చేసుకుంటున్నారు అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా పెళ్లి ఫోటోలు దిగడం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారి స్టేటస్ తెలియజేసుకుంటున్నారు అంటూ ఈయన ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక వీడియో గ్రాఫర్ చెప్పిన మాటలు విని తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. ఏదో పెళ్లిలో ఫోటోగ్రాఫర్ రావడం ఆలస్యం అవుతుందని తెలిసి పెళ్లికూతురు స్పృహ తప్పి పడిపోయిందట ఈ ఘటన నిజంగానే జరిగిందంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఈ ట్వీట్ పై పలువురు నెటిజెన్స్ స్పందిస్తూ మీరు చెప్పింది నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక డైరెక్టర్ వివేక అగ్నిహోత్రి ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ నటి పరిణితి చోప్రా జంటను ఉద్దేశించి చేశారని తెలుస్తోంది. పరిణితి చోప్రా ఎంపీ రాఘవ చద్దాతో నిశ్చితార్థం జరుపుకున్న అనంతరం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

అయితే ఈ ఫోటోలు వైరల్ అవుతున్న తరుణంలో(Director) ఈయన పెళ్లిళ్ల గురించి ఈ విధమైనటువంటి కామెంట్ చేయడంతో ఈయన వారిని ఉద్దేశించే ఇలాంటి కామెంట్స్ చేశారని తెలుస్తుంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus