Radhe Shyam Movie: రాధేశ్యామ్ సీక్రెట్స్ చెప్పుకొచ్చిన డైరెక్టర్!

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాపై ఇప్పటికే భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ రెండో సినిమాగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాధేశ్యామ్ కథ గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమా విడుదలకు నెల రోజుల సమయం మాత్రమే ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధాకృష్ణ కుమార్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

రాధేశ్యామ్ మూవీ ఇంటెన్స్ ప్రేమకథ అని లైఫ్ అండ్ డెత్ మధ్య పార్టీ రాధేశ్యామ్ సినిమా అని రాధాకృష్ణ కుమార్ వెల్లడించారు. ఈ రెండింటి మధ్య పార్టీ జరిగితే ఏ విధంగా ఉంటుందో రాధేశ్యామ్ ద్వారా అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. సినిమాలో ఎమోషన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు వెల్లడించారు. కొంతమంది జాతకాలను నమ్ముతారని మరి కొందరు నమ్మరని జాతకాలు నిజమా? అబద్ధమా? అనే చర్చ జరుగుతూ ఉంటుందని వీటి మధ్యలోకి ప్రేమను తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ మూవీ తెరకెక్కిందని రాధాకృష్ణ కుమార్ వెల్లడించారు.

రాధేశ్యామ్ మూవీకి యూరప్ బ్యాక్ డ్రాప్ తీసుకోవడం గురించి దర్శకుడు స్పందిస్తూ ఆ క్రెడిట్ ప్రభాస్ కు దక్కుతుందని ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా ఎంపికైన తర్వాత ఈ సినిమా స్థాయి పెరిగిందని రాధాకృష్ణ కుమార్ వెల్లడించారు. మన దేశంలో రాధేశ్యామ్ ను వింటేజ్ లుక్ తో తీయాలని తాను భావించానని ప్రభాస్ యూరప్ బ్యాక్ డ్రాప్ ను ఎవరూ టచ్ చేయలేదని చెప్పడంతో తన ఆలోచన మారిందని దర్శకుడు చెప్పుకొచ్చారు.

15 సంవత్సరాల నుంచి తాను ఈ సినిమా కథతో ట్రావెల్ అవుతున్నానని రాధాకృష్ణ కుమార్ పేర్కొన్నారు. ఒక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకోవడం వల్లే ఈ సినిమా కథ పుట్టిందని త్వరలోనే రాధేశ్యామ్ కథ పుట్టుక వెనుక కారణాలను తెలియజేస్తానని రాధాకృష్ణ కుమార్ అన్నారు. అతి త్వరలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుండగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus