సహజంగా మన టాలీవుడ్ విషయమే తీసుకుంటే మన్‌కున్న బడా హీరోలకు మంచి మార్కెట్ ఉంది. అయితే సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే కలెక్షన్స్ తో తొడగొట్టి రికార్డులను రివార్డులుగా చూపించుకునే మన హీరోలే, అదే వారి సినిమా ఫ్లాప్ అయితే మాత్రం కనీసం బయ్యర్స్ కు పెట్టిన డబ్బులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. అయితే ఎంత పెద్ద హీరో అయినా సినిమా హిట్ అయితేనే అన్నీ..లేదంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అయినా డిజాస్టర్ పేరుతో ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ నిరూపించింది. ఇక అదే క్రమంలో శ్రీమంతుడు సినిమాతో దాదాపుగా 80కోట్ల రూపాయలు వసూలు చేసిన ప్రిన్స్ మహేష్ బ్రహ్మోత్సవం తో మాత్రం బయ్యర్స్ కు నష్టాలే మిగిల్చాడు. మరి ఇలా చేదు అనుభవాన్ని మిగిల్చిన కొన్ని సినిమాలకు ఒక లుక్ వేద్దాం రండి.
పవన్ కల్యాణ్ – సర్దార్ గబ్బర్ సింగ్పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇటీవల విడుదలై భారీ ప్లాప్ అయింది. ప్లాపైనా ఈచిత్రం రూ. 52.92 కోట్లు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణల్లో 40.94 కోట్లు వసూలు చేసింది. టాలీవుడ్ ప్లాప్ చిత్రాల్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
మహేష్ బాబు – ఆగడుఇంతకు ముందు మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ చిత్రం భారీ ప్లాప్ అయింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ 34.05 కోట్లు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణల్లో 21.75 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు న్రాహ్మోత్సవం పరిస్థితి అదే రకంగా కనిపిస్తుంది.
రామ్‌చరణ్ – ‘బ్రూస్ లీరామ్ చరణ్ గత చిత్రం ‘బ్రూస్ లీ’ చిత్రం ప్లాపైన సంగతి తెలిసిందే. ఈచిత్రం వరల్డ్ వైడ్ 40.91 కోట్లు వసూలు చేసింది. ప్లాపుల్లో సెకండ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఏపీ, తెలంగాణల్లో రూ. 32.36 కోట్లు వసూలు చేసింది.
అల్లు అర్జున్ – వరుడు
అల్లు అర్జున్ కెరీర్లో ప్లాప్ అంటే ‘వరుడు’ చిత్రమే. ఈచిత్రం అప్పట్లో రూ. 18 కోట్ల షేర్ వసూలు చేసింది. ‘బ్రదినాథ్’ చిత్రం చాలా ఏరియాల్లో నష్టాలనే మిగిలిచ్చినా సీడెడ్, కర్ణాటక లాంటి కొన్ని ఏరియాల్లో లాభాలు వచ్చాయి. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 30 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఎన్టీఆర్ – ‘రామయ్యా వస్తావయ్యఎన్టీఆర్ గత చిత్రం ‘రామయ్యా వస్తావయ్య’ ప్లాపే. ఈ చిత్రం రూ. 30.23 కోట్లు వసూలు చేసింది. ఏపీ తెలంగాణల్లో 23.83 కోట్లు వసూలు చేసింది. మరో ప్లాప్ రభస 26.34 కోట్లు వసూలు చేయగా ఏపీ, తెలంగాణల్లో 20.84 కోట్లు వసూలు చేసింది.
ప్రభాస్ – రెబెల్ప్రభాస్ ప్లాపు చిత్రం ‘రెబెల్’25.40 కోట్లు వసూలు చేసింది. ఏపీ తెలంగాణల్లో 21.26 కోట్లు వసూలు చేసింది.