మాస్ మహా రాజ్ రవితేజ గత సినిమాలు అయిన ‘టచ్ చేసి చూడు’ ‘ నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రాలు పెద్ద డిజాస్టర్లు అయిన సంగతి తెలిసిందే. దీంతో ఓ ఏడాది గ్యాప్ తీసుకుని రవితేజ ‘డిస్కో రాజా’ చిత్రం చేసాడు. ‘ఎక్కడికి పోతావ్ చిన్న వాడా’ ఫేమ్ వి.ఐ. ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. స్కైఫై నేపధ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రామ్ తళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 24న(రేపు) విడుదల కాబోతుంది.
ఓ రీసెర్చ్ విజయవంతం అయితే… ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఓ కాలానికి చెందిన వ్యక్తి మరో కాలంలో ఎలా ప్రవర్తిస్తాడు.. అనేది ఈ చిత్రం కథాంశం అని తెలుస్తుంది. ఈ చిత్రంలో హీరో రవితేజ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. బాబీ సింహా, తాన్య హాప్ పాత్రలు చాలా కీలకంగా ఉంటుందట.
హీరోయిన్ లలో నభా నటేష్ పాత్ర ఆకట్టుకుంటుందట. మరో హీరోయిన్ పాయల్ ది జస్ట్ గ్లామర్ రోల్ అని తెలుస్తుంది.
తమన్ సంగీతంలో రూపొందిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట.
ఈ చిత్రం ద్వారా ఓ కొత్త రవితేజ ను చూడబోతున్నాం అని సమాచారం. అయితే ఇప్పటి వరకూ మనం రవితేజ నుండీ ఎంజాయ్ చేసిన మాస్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో తక్కువగా ఉంటాయట.
ఫస్ట్ హాఫ్ యమ ఫాస్ట్ గా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని… ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ అలరిస్తుందని తెలుస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం కన్ఫ్యూ జింగ్ గా ఉంటుందని… అయితే క్లయిమాక్స్ బాగా వచ్చిందని తెలుస్తుంది. ఓవర్ ఆల్ గా స్కైఫై మూవీ అయినప్పటికీ ఈ చిత్రం అందరినీ అలరించే విధంగా ఉంటుందని తెలుస్తుంది. మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయితే రవితేజ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడం గ్యారంటీ అని సమాచారం. మరి వీటిలో ఎంతవరకూ నిజముందో రేపు తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ టు మాస్ మహా రాజ్ అండ్ ఫ్యాన్స్.!