2009 లో ‘ఈరం’ అనే సినిమా వచ్చింది. ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) హీరోగా నటించిన ఈ సినిమాకి అరివళగన్ వెంకటాచలం (Arivazhagan Venkatachalam) దర్శకుడు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. తర్వాత దాన్ని ‘వైశాలి’ గా తెలుగులోకి డబ్ చేశారు. ఇక్కడ కూడా అది మంచి టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ అందుకుంది. దాదాపు 16 ఏళ్ళ తర్వాత ‘వైశాలి’ కాంబినేషన్లో ‘శబ్దం’ (Sabdham) అనే సినిమా వస్తుంది. ఫిబ్రవరి 28న ఈ సినిమా విడుదల కాబోతోంది.
‘మైత్రి డిస్ట్రిబ్యూషన్’ సంస్థ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తుంది. ఈ సందర్భంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో డిస్ట్రిబ్యూటర్ శశి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. శశి మాట్లాడుతూ.. ” ‘వైశాలి’ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. అదే కాంబినేషన్లో 16 ఏళ్ళ తర్వాత ‘శబ్దం’ సినిమా రూపొందింది. దీనిని తెలుగులో రిలీజ్ చేసే అవకాశం మాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాం.
‘శబ్దం’ అనేది ‘వైశాలి’ కి సీక్వెల్ వంటి సినిమా. అలాగే ఉంటుంది. అక్కడ వాటర్(నీరు) అయితే ఇక్కడ ‘శబ్దం’. సౌండ్ క్వాలిటీ కూడా ఇందులో చాలా బాగుంటుంది. హర్రర్ సినిమాలు అంటే ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ‘వైశాలి’ కి ‘శబ్దం’ సీక్వెల్ అని శశి చెప్పడంతో.. సగం కథ చెప్పేసినట్టే అనుకోవాలి. హర్రర్ సినిమాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. డీసెంట్ టాక్ కనుక వస్తే ‘శబ్దం’ కచ్చితంగా థియేటర్లలో నిలబడుతుంది అనే చెప్పాలి.
వైశాలికి సీక్వెల్ వంటిది ఈ శబ్దం..
అక్కడ వాటర్ భయపెడితే ఇక్కడ సౌండ్ భయపెడుతుంది : మైత్రి శశి#Aadhi #LakshmiMenon #Thaman #Nani pic.twitter.com/sUU7YKNlh5
— Filmy Focus (@FilmyFocus) February 21, 2025