సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డిజె టిల్లు’. ‘ఫార్చూన్ ఫోర్ సినిమాస్’ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా… డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. విడుదల చేసిన టీజర్, ప్రోమోలు, పాటలకి మంచి స్పందన లభించింది. ఫిబ్రవరి 12న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్రం పై యూత్ లో భారీ క్రేజ్ నెలకొంది. ఓ విధంగా విజయ్ దేవరకొండ సినిమాకి ఎలాంటి హైప్ ఉంటుందో ఆ రేంజ్ హైప్ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతో బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరిగింది.
ఒకసారి థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం
2.50 cr
సీడెడ్
1.50 cr
ఉత్తరాంధ్ర
0.80 cr
ఈస్ట్
0.48 cr
వెస్ట్
0.40 cr
గుంటూరు
0.55 cr
కృష్ణా
0.45 cr
నెల్లూరు
0.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
6.98 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
2.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
8.98 cr
‘డిజె టిల్లు’ చిత్రానికి రూ.8.98 కోట్ల బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు రూ.9.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. బుకింగ్స్ అయితే భారీగా నమోదవుతున్నాయి. శనివారం రోజున అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే రవితేజ ‘ఖిలాడి’ బుకింగ్స్ కంటే కూడా ఎక్కువగా నమోదయ్యాయి. సినిమాకి ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా భారీ ఓపెనింగ్స్ నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో ఇప్పటివరకు ఒక్క ‘భీష్మ’ తప్ప మరే మూవీ కూడా బ్రేక్ ఈవెన్ సాధించింది లేదు. మరి ‘డిజె టిల్లు’ కూడా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందేమో చూడాలి..!