సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన డీజే టిల్లు సినిమా నైజాం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. భీమ్లా నాయక్ విడుదలైనా పరిమిత సంఖ్యలో థియేటర్లలో డీజే టిల్లు ప్రదర్శితమవుతోంది. భీమ్లా నాయక్ సినిమాకు టికెట్లు దొరకని వాళ్లకు ఈ సినిమా మంచి ఆప్షన్ గా నిలుస్తోంది. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, నేహాశర్మ తమ పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారనే చెప్పాలి. అయితే ఓటీటీ ప్రేక్షకులు సైతం డీజే టిల్లు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఆహా ఓటీటీలో మార్చి నెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుందని బోగట్టా. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డీజే టిల్లు ఎప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చినా అభిమానులు మాత్రం ఈ సినిమాను ఓటీటీలో కూడా హిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం ఓటీటీలో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితమే సిద్ధు జొన్నలగడ్డ ఇండస్ట్రీకి వచ్చినా డీజే టిల్లు సినిమాతోనే సిద్ధు అభిమానులకు మరింత చేరువయ్యారు.
డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. డీజే టిల్లు సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీగా డీజే టిల్లు తెరకెక్కగా ఆహా నిర్వాహకులు త్వరలో డీజే టిల్లు స్ట్రీమింగ్ కానుందని ప్రచారం చేస్తుండటం గమనార్హం. డీజే టిల్లు చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు నిర్మాతలకు భారీగా లాభాలను అందించింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డకు సినిమా ఆఫర్లు పెరిగాయని బోగట్టా.
డీజే టిల్లు సక్సెస్ తో సిద్ధు జొన్నలగడ్డ రెమ్యునరేషన్ ను పెంచారని సమాచారం. డీజే టిల్లు సినిమాతో సిద్ధు జొన్నలగడ్డను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా ఊహించని స్థాయిలో పెరగడం గమనార్హం.