చిరంజీవి సినిమాలో నటించినందుకు అల్లు శిరీష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

మెగా కాంపౌండ్ నుంచి హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో అల్లు శిరీష్ ఒకరు. గౌరవం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయారు. అయితే తాజాగా ఊర్వశివో రాక్షసివో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇకపోతే గౌరవం సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి అల్లు శిరీష్ బాల నటుడిగా కూడా నటించారు అనే విషయం చాలామందికి.

ఈయన మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలో నటించారు. అల్లు శిరీష్ చిరంజీవి హీరోగా హిందీలో రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించారు. అల్లు అరవింద్ నిర్మాతగా గీత ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించిన ప్రతి బంద్ సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా అల్లు శిరీష్ ఓ విద్యార్థి పాత్రలో నటించారు. ఈ విషయం చాలామందికి తెలియదు అయితే తాజాగా ఈ విషయాన్ని ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో అల్లు శిరీష్ వెల్లడించారు.

ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో తనకు మూడు సంవత్సరాల వయసు ఉందని అయితే ఈ సినిమాలో నటించినందుకు తనకు వంద రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారంటూ ఈ సందర్భంగా అల్లు శిరీష్ తాను చిరంజీవితో కలిసి నటించిన సినిమా గురించి ఈ సందర్భంగా బయటపెట్టారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus