గుణశేఖర్ అల్లుడు ఎవరు.. తన బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. దర్శకుడిగా ఎన్నో పౌరాణిక సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన గుణశేఖర్ తన కుమార్తె నీలిమను కూడా ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం చేశారు. ఈ క్రమంలోనే నీలిమ సమంత నటించిన శాకుంతలం సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికి నీలిమ వైవాహిక జీవితంలోకి కూడా అడుగు పెట్టారు.

శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల 31 నిమిషానికి నీలిమ వివాహం ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు అయినటువంటి రవి ప్రఖ్యాతో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.వీరి వివాహం హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలెస్ లో ఎంతో కనుల పండుగగా జరిగింది. వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే నీలిమ భర్త గుణశేఖర్ అల్లుడు ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయం గురించి పెద్ద ఎత్తున నేటిజెన్లు సెర్చ్ చేస్తున్నారు.

అయితే రవి ప్రఖ్యా హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడని తెలుస్తుంది. రవి ప్రక్యా హైదరాబాద్ కి చెందిన ప్రముఖ విద్య వ్యాపారవేత్త, శ్రీ శక్తి అధినేత డాక్టర్ రామకృష్ణ, సత్య దంపతుల కుమారుడు. ఇలా హైదరాబాదులో ఎన్నో విద్యాసంస్థలను వ్యాపార సంస్థలను నడుపుతూ వేల కోట్లకు ఆస్తిపరుడు అయినటువంటి వ్యాపారవేత్త కుమారుడితో నీలిమ వివాహం జరిగింది. ఇక రవి ప్రఖ్యా కూడా బిజినెస్ మెన్ గా ఎంతో గుర్తింపు పొందారని తెలుస్తోంది. మొత్తానికి గుణశేఖర్ అల్లుడి బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదని తెలుస్తోంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus