80 ఏళ్ళ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జాతీయ అవార్డు ఎన్టీఆర్ కాలం నుండి చిరంజీవి కాలం వరకు ఒక్క హీరో కి కూడా దక్కలేదు. కారణాలు ఏవైనా కానీ, ఇది మన తెలుగు హీరోలకు అవమానకరంగా ఉండేది. అయితే రాజమౌళి పుణ్యమా అని మన టాలీవుడ్ కి పాన్ ఇండియన్ మార్కెట్ వచ్చింది. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ లో మన సత్తా చూపించాం, 10 విభాగాలలో అవార్డ్స్ ని అందుకున్నాము. అలాగే టాలీవుడ్ నుండి జాతీయ అవార్డు ని అందుకున్న మొట్టమొదటి హీరో గా అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఆయన అభిమానులకు ఇది ఎంత గర్వకారణం గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ మాత్రం ఆర్.ఆర్.ఆర్ చిత్రం లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ పుష్ప లో అల్లు అర్జున్ కంటే అద్భుతంగా నటించారని, అలాంటి హీరోలకు అవార్డ్స్ ఇవ్వకుండా అల్లు అర్జున్ కి ఇవ్వడం న్యాయం కాదు అంటూ పోస్టులు పెడుతున్నారు.
అల్లు అర్జున్ (Allu Arjun) మరియు ఆయన వ్యక్తిగత పీఆర్ టీం నేషనల్ అవార్డు కోసం బ్యాకెండ్ లో చాలా కష్టపడ్డారని, మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిల వరకు డబ్బులను ఖర్చు చేసి అవార్డు ని అల్లు అర్జున్ కి వచ్చేలా చేసారని కొంతమంది నెటిజెన్స్ ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లో పుష్ప సినిమాకి ఉన్నంత రీచ్ ఏ సినిమాకి కూడా రాలేదు,
సినీ సెలబ్రిటీస్ నుండి క్రికెటర్స్, ఫుట్ బాల్ ప్లేయర్స్, రాజకీయ నాయకులూ ఇలా అందరూ కూడా పుష్ప లో అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని అనుసరించిన వాళ్ళే. ఇదంతా కేవలం అల్లు అర్జున్ అద్భుతమైన నటన వల్లే సాధ్యపడింది, తన నటనతో కోట్లాది మందిని ఈ స్థాయిలో ప్రభావితం చేసిన అల్లు అర్జున్ కి కాక ఇక ఏ హీరోకి అవార్డు దక్కుతుంది ? , మీ హీరోకి అవార్డ్స్ రానప్పుడు ఇలాంటి నిందలు వెయ్యడం కరెక్ట్ కాదు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్తున్నారు.