బిగ్ బాస్ వల్ల అన్ని కోట్లు సంపాదించారా?

అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మొదటి రెండు సీజన్లను మినహా ప్రతి ఒక్క సీజన్ కి ఈయనే వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ఇలా మూడో సీజన్ నుంచి ఏడవ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు అలాగే ఒక ఓటీటీ కార్యక్రమానికి కూడా ఈయన వ్యాఖ్యతగా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ప్రతి ఒక్క సీజన్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు

అయితే ఈ కార్యక్రమం ద్వారా నాగార్జున ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే విషయం గురించి ఎవరికీ క్లారిటీ లేదు. ఈ కార్యక్రమానికి నాగార్జున రెమ్యూనరేషన్ పరంగా డబ్బు తీసుకుంటున్నారా లేకపోతే కార్యక్రమానికి వచ్చే కమిషన్ బేస్ చేసుకుని రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారా అనే విషయం గురించి ఎంతోమందికి సందేహాలు వస్తూ ఉంటాయి. అయితే నాగార్జున ఈ కార్యక్రమానికి కమిషన్ పరంగా కాకుండా రెమ్యూనరేషన్ బేస్ మీద గాని తీసుకుంటారని తెలుస్తుంది.

ఒక్కో ఎపిసోడ్ కు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటారు అన్న విషయాలు క్లారిటీగా తెలియదు కానీ ఈయన మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా ఏకంగా 120 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. కేవలం నాలుగు సీజన్లకే 120 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మాములు విషయం కాదు అని చెప్పాలి.

ఈ కార్యక్రమం కాన్సెప్ట్ అంటే తనకు నచ్చదు అంటూ మొదట్లో బిగ్ బాస్ కార్యక్రమం గురించి కామెంట్లు చేసినటువంటి నాగార్జున ఇప్పుడు అదే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఇన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక ఈయనకు రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా ఈసెట్ అన్నపూర్ణ స్టూడియోలో వేయడంతో సెట్ వేసినందుకుగాను నాగార్జున భారీ మొత్తంలోనే రెంట్ కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus