ఫ్యాక్షన్ సినిమాలు, యాక్షన్ సినిమాలు, పగలు, ప్రతీకారాలు వెండితెరను ఏలుతున్న సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమను పూర్తిగా ప్రేమమయం చేసిన సినిమా ‘నువ్వు నేను’. టాలీవుడ్ నుంచి వచ్చిన గొప్ప ప్రేమకథల్లో ఒకటిగా నిలిచిపోయిన ఈ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు దాటింది. సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న ‘‘పేద ధనిక’ తారతమ్యాలకు కాలేజీ బ్యాక్ డ్రాప్ ను మిక్స్ చేసి డైరెక్టర్ తేజ కాన్వాస్ పై చిత్రీకరించిన ప్రేమకథే ‘నువ్వునేను’. ఈ అడ్డుగోడలను బద్దలుకొట్టి చివరికి విద్యార్థులంతా ఏకమై అసెంబ్లీ ముందు హీరో, హీరోయిన్ల పెళ్లి చేయడంతో కథకు శుభం కార్డు పడుతుంది.
ఈ సినిమాలోని పాటలు ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి. ‘‘గాజువాక పిల్లా’’, ‘‘నువ్వునేను’’, ‘‘నీ కోసమే’’ , ‘‘ నా గుండెలో’’ వంటి పాటలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 2001 ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమాకు జనం బ్రహ్మరథం పట్టారు. అప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ కు ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చింది. ఇక తేజ , ఆర్పీ పట్నాయక్ లు బిజీ అయిపోయారు. ముక్కు మొహం తెలియని నటులతో తేజ సంచలన విజయం అందుకున్నాడు.
అంతేకాదు.. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హాస్యనటుడు, సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సహాయ నటుడు ఇలా రాష్ట్ర ప్రభుత్వం నుండి 5 నంది అవార్డులు దక్కాయి. దీంతో పాటు నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం ‘నువ్వు నేను’ సొంతం చేసుకుంది. అయితే యాదృచ్చికమో , విధి రాత అనుకోవాలో కానీ ఈ సినిమాలో నటించిన చాలా మంది నటీనటులు ఇప్పుడు మన ముందు లేరు. హీరో ఉదయ్ కిరణ్ వ్యక్తిగత కారణాలు, మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఈ తర్వాత కాలేజీ ప్రిన్సిపాల్ పాత్రలో నవ్వించిన ఎమ్మెస్ నారాయణ, లెక్చరర్ గా ఆకట్టుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్, హీరో తండ్రిగా నటించిన వైజాగ్ ప్రసాద్‌లు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. తమ నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వీరంతా ఒక్కొక్కరిగా మృతి చెందడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. అంతేకాదు ‘నీ స్నేహం’ సినిమాలో ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన ఆర్తి అగర్వాల్, ‘కలుసుకోవాలని’ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించిన ప్రత్యూష కూడా మరణించిన సంగతి తెలిసిందే.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!