టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. బాలయ్య గత కొన్నేళ్లుగా హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ అక్కడ అనుకూల ఫలితాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. హిందూపురంలో బాలయ్య దూకుడుకు బ్రేక్ వేయడం ఏ పార్టీకి సాధ్యం కావడం లేదు. హిందూపురం అభివృద్ధి కోసం బాలయ్య కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
హిందూపురం అభివృద్ధి కొరకు (Balayya Babu) బాలయ్య తన సొంత డబ్బును ఖర్చు చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది. అయితే వైసీపీ నుంచి 2024 ఎన్నికల్లో బాలయ్యకు పోటీగా దీపికారెడ్డి పోటీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం దీపికా రెడ్డి హిందూపురం వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళా నేత దీపికా రెడ్డి కావడం గమనార్హం.
దీపికారెడ్డికి వైసీపీలో కీలకంగా ఉన్న హిందూపురం నుంచి ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న ఇతర నేతల నుంచి సపోర్ట్ లభిస్తుందో లేదో చూడాల్సి ఉంది. నందమూరి నట సింహం బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో బిజీగా ఉండగా మరికొన్ని నెలల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. సలార్ విడుదలైన మూడు వారాలకు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం.
అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. బాలయ్య రాజకీయాల్లో కూడా సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలయ్య పొలిటికల్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. బాలయ్య పారితోషికం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సినిమా సినిమాకు బాలయ్యకు క్రేజ్ పెరుగుతోంది. బాలయ్య తర్వాత సినిమాలపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలు సక్సెస్ సాధించి బాక్సాఫీస్ ను షేక్ చెస్తాయేమో చూడాల్సి ఉంది.