‘కె.జి.ఎఫ్’ (KGF) తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు ప్రశాంత్ నీల్. చెప్పుకోడానికి తెలుగు వాడే అయినప్పటికీ కన్నడ సినిమాతోనే స్టార్ గా ఎదిగాడు. అయితే అతని స్టార్ డమ్ ను కాపాడుకోవడానికి తెలుగు హీరోలైతేనే మంచి ఆప్షన్ అని అతను ఫిక్స్ అయ్యాడు. అందుకే వరుసగా తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ తెలుగులో అతను ప్రభాస్ (Prabhas) తో ‘సలార్’ (Salaar) చేసిన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్ కూడా ఉంటుందని రివీల్ చేశారు.
‘సలార్ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క ‘కెజిఎఫ్ 3’ కూడా ఉంటుందని కూడా హింట్ ఇచ్చాడు ప్రభాస్. కానీ అది ఎలా తీస్తాడు? ఎక్కడ నుండి మొదలు పెడతాడు అనే ఆసక్తి కూడా ఉంది. అయితే వాటిని వెంటనే స్టార్ట్ చేయకుండా కొంత గ్యాప్ ఇస్తే.. హైప్ బిల్డ్ అవుతుంది అనేది ప్రశాంత్ నీల్ (Prashanth Neel) అభిప్రాయం. అందుకోసమే మధ్యలో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
‘డ్రాగన్’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది అని నిర్మాతలైన ‘మైత్రి’ వారు రివీల్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ (Jr NTR) లేకుండా కొంత పోర్షన్ ను షూట్ చేశారు కూడా. ఇది పీరియాడిక్ మూవీనే..! ఏప్రిల్ 22 నుండి ఎన్టీఆర్ షూటింగ్లో జాయిన్ అవుతున్నట్టు… ఓ ఫోటోతో కన్ఫర్మ్ చేశారు. ‘2 మాస్ ఇంజిన్స్ రేపటి నుండి సెట్స్ లో పనిచేస్తాయి’ అంటూ మేకర్స్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలిసి ఉన్న ఓ ఫోటోతో క్లారిటీ ఇచ్చారు.
అయితే 2023 ఏప్రిల్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని గతంలో మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. అయితే 2 ఏళ్ళ తర్వాత అంటే 2025 ఏప్రిల్ లో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతుండటం గమనార్హం. అలా ఎన్టీఆర్- నీల్ ప్రాజెక్టు 2 ఏళ్ళు ఆలస్యమైందని అర్థం చేసుకోవచ్చు. ఇక శరవేగంగా షూటింగ్ జరిపి 2026 సమ్మర్ కి ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో టీం ఉన్నట్టు సమాచారం.