మంచి వెదవల్ని అసలు వదులుకోకూడదు.. డాక్టర్ బాబు పోస్ట్ వైరల్!

బుల్లితెర శోభన్ బాబుగా ఎన్నో సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బుల్లితెర నటుడు పరిటాల నిరుపమ్. ఈయన చంద్రముఖి సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం పలు చానల్లో వివిధ రకాల సీరియల్స్ లో నటించి గుర్తింపు పొందారు.ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ద్వారా ఈయన డాక్టర్ బాబుగా అందరికీ సుపరిచితమయ్యారు.

ఇలా డాక్టర్ బాబుగా ఫేమస్ అయినటువంటి పరిటాల నిరుపమ్ ప్రస్తుతం ఎలాంటి బుల్లితెర సీరియల్స్ లోను నటించలేదు. అయితే ఇకపై తాను సీరియల్స్ నటించనని సీరియల్స్ ను నిర్మించి నిర్మాతగా మారబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా పలు వెబ్ సిరీస్ లలో కూడా తాను నటించబోతున్నట్లు వెల్లడించారు. ఇకపోతే డాక్టర్ బాబు తన భార్య మంజులతో కలిసి మంజుల నిరుపమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్నో వీడియోలను వారి యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈయన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముందుగా ఇంస్టాగ్రామ్ ఫ్యామిలీకి తన స్నేహితులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఈయన మనం చేసే ఎదవ పనులకి సపోర్ట్ చేయాలంటే ఫ్రెండ్స్ ఎంతో ముఖ్యం అయితే అందులో మంచి వెధవలు కూడా ఉంటారు. అలాంటి వారిని ఎప్పటికీ మిస్ చేసుకోవద్దు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ ఈయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus