ఈ హీరోయిన్ సినిమాలకు దూరమైనట్లేనా..?

బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అందం, అభినయం పుష్కలంగా ఉన్నా నటించిన సినిమాలు సక్సెస్ కాకపోతే హీరోయిన్లు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేరనే సంగతి తెలిసిందే. నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన జోష్ సినిమాతో కార్తీక టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో నటించిన తొలి సినిమానే ఫ్లాప్ కావడంతో కార్తీకకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. సీనియర్ హీరోయిన్ రాధ కూతురైన కార్తీకకు రంగం మినహా నటించిన మరే సినిమా హిట్ కాలేదు.

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దమ్ము సినిమాలో కార్తీక సెకండ్ హీరోయిన్ గా నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగులో కార్తీక చివరగా అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలో నటించారు. ఆ తరువాత టాలీవుడ్ కు దూరమైన కార్తీక హిందీలో ఆరంభ్ సీరియల్ లో నటించి ఆ తరువాత సినిమాలు, సీరియళ్లకు పూర్తిగా దూరమయ్యారు.

కథల ఎంపికలో పొరపాట్లు చేయడం, నటన పరంగా సినిమాసినిమాకు ఇంప్రూవ్ కాకపోవడం వల్ల కార్తీక తల్లి స్థాయిలో స్టార్ డమ్ సంపాదించుకోలేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కార్తీక ప్రస్తుతం యూడీఎస్‌ హోటల్‌ గ్రూప్‌కు డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో కార్తీక మళ్లీ వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. టాలీవుడ్ దర్శకనిర్మాతలు సైతం దాదాపుగా ఈ హీరోయిన్ ను మరిచిపోవడం గమనార్హం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus