‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సూపర్ హిట్ తర్వాత..’షాడో’ ‘మసాలా’ వంటి ప్లాప్ లను మూటకట్టుకున్నాడు వెంకీ. ఆ టైములో వెంకటేష్ పని ఇక అయిపోయినట్టే అనే కామెంట్లు వినిపించాయి. అలాంటి టైములో మలయాళం సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ ను తెలుగులో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు వెంకీ. 2014వ సంవత్సరం జూన్ 11న విడుదలైన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ… మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం ఆశాజనకంగా నమోదు కాలేదు. అయితే రెండో రోజు నుండీ ఈ చిత్రం పికప్ అయ్యింది.ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది.
ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 7ఏళ్ళు పూర్తికావస్తోంది. మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
7.30 cr
సీడెడ్
2.15 cr
ఉత్తరాంధ్ర
2.40 cr
ఈస్ట్
1.08 cr
వెస్ట్
0.75 cr
గుంటూరు
1.35 cr
కృష్ణా
1.07 cr
నెల్లూరు
0.55 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
16.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
3.35 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
20 cr
‘దృశ్యం’ చిత్రానికి కేవలం రూ.11.32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.20 కోట్ల షేర్ ను రాబట్టి.. సూపర్ హిట్ గా నిలిచింది.బయ్యర్లకు రూ.8.68 కోట్ల లాభాలను అందించింది ఈ చిత్రం.