‘లవ్ టుడే’ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. తమిళ కుర్రాడే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా అతన్ని బాగా ఓన్ చేసుకున్నారు. ఈ దీపావళికి అంటే అక్టోబర్ 17న అతను ‘డ్యూడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్..లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
సూర్య బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆకాశం నీ హద్దురా’ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కీర్తీశ్వరన్ ‘డ్యూడ్’ సినిమాతో దర్శకుడిగా మారడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ‘డ్యూడ్’ సినిమా తెలుగు థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను ఒకసారి గమనిస్తే :
నైజాం | 4 cr |
సీడెడ్ | 1 cr |
ఆంధ్ర(టోటల్) | 3 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 8 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) | 1 cr |
ఓవర్సీస్ (తెలుగు వెర్షన్) | 1 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 10 కోట్లు(షేర్) |
‘డ్యూడ్’ చిత్రం తెలుగు వెర్షన్ కి రూ.10 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం బాక్సాఫీస్ వద్ద రూ.11 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. దీపావళికి వస్తున్న సినిమాల్లో ‘డ్యూడ్’ కి మంచి హైప్ ఉంది. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.