‘లవ్ టుడే’ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలతో యూత్ లో భీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. తమిళ కుర్రాడే అయినప్పటికీ తెలుగులో కూడా అతనికి మంచి క్రేజ్ ఉంది. ఈ దీపావళికి ‘డ్యూడ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్..లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్లో ఆ బ్యానర్ వరుస హిట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
సూర్య బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆకాశం నీ హద్దురా’ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కీర్తీశ్వరన్ ‘డ్యూడ్’ సినిమాతో దర్శకుడిగా మారుతుండడం ఓ విశేషంగా చెప్పుకోవాలి. ఇది కనుక హిట్ అయితే..ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టేసినట్టే అని చెప్పాలి.ఇదిలా ఉండగా.. ‘డ్యూడ్’ సినిమాని ఆల్రెడీ టాలీవుడ్లో ఉన్న పెద్దలు అలాగే సుకుమార్ వంటి స్నేహితులకు చూపించారట ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు. సినిమా చూసిన తర్వాత వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది.
వారి టాక్ ప్రకారం.. ‘డ్యూడ్’ సినిమా 2 గంటల 19 నిమిషాలు ఉంటుందట. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల్లోనే అందరినీ కథలోకి తీసుకువెళ్తుందట. బ్యాక్ టు బ్యాక్ యూత్ ను ఎంటర్టైన్ చేసే కామెడీ ఎలిమెంట్స్ వస్తాయట. ఇంటర్వెల్ వద్ద ఒక ఊహించని టర్న్ తీసుకుంటుందట. సెకండాఫ్ అంతా ఆ పాయింట్ చుట్టూనే నడుస్తుందట.
క్లైమాక్స్ ఎమోషనల్ సాగుతూనే ఓ మంచి మెసేజ్ కూడా ఇస్తుందని అంటున్నారు. ప్రదీప్ రంగనాథన్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుందట. మామితా బైజు మరోసారి తన క్యూట్ పెర్ఫార్మన్స్ తో అలరిస్తుంది అని తెలుస్తుంది. నేహా శెట్టి రోల్ కూడా చాలా కీలకంగా ఉంటుందట. ఆమె కంటే కూడా శరత్ కుమార్ పాత్ర హైలెట్ అవుతుంది అంటున్నారు. చూడాలి మరి రిలీజ్ రోజున ఎలాంటి టాక్ వస్తుందో..!