సినీ పరిశ్రమలో రాణించాలి అనుకునే వాళ్ళు అహం- ఆత్మగౌరవం.. వంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఒక్క సినీ పరిశ్రమలో అనే కాదు.. ఏ పరిశ్రమలో అయినా సరే చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మాటలు పడాల్సి వస్తుంది.మన దగ్గర టాలెంట్ ఉంది కదా అని రెచ్చిపోతే మంచి భవిష్యత్తుని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఇందుకు ఉదాహరణలు చాలానే ఉన్నా.. ప్రస్తుతం టాపిక్ ఒకప్పటి సంగీత దర్శకుడు ఏ.ఎం.రాజా కాబట్టి.. ఆయన గురించి చెప్పుకుందాం.
ఒకప్పుడు టాలీవుడ్లో జిక్కీ, ఎ.ఎం.రాజా సింగర్స్ కి చాలా మంచి పేరు ఉండేది. వీళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. సంగీత దర్శకుడిగా ఎ.ఎం.రాజాకి చాలా మంచి పేరు ఉంది. అయితే ఈయనకి అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా కచేరీలు చేసుకుంటున్నట్టు అప్పట్లో చర్చ జరిగేది. దీని పై ఆమె కూతురు హేమలత క్లారిటీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. “మా నాన్నగారి వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుంది అని అంతా అంటుంటారు.
‘మెలోడీ కింగ్’ అనే పేరు కూడా సంపాదించుకున్నారు. ఎంజీఆర్ .. శివాజీ గణేశన్ .. జెమినీ గణేశన్ వంటి స్టార్లు ఆయనతోనే ఎక్కువ పాటలు పాడించుకున్న సందర్భాలు ఉన్నాయి. నాన్నగారు కంపోజ్ చేసిన పాటలన్నీ హిట్లే. మా అమ్మ అయితే బాలనటిగా సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చారు. ‘అనార్కలి’ సినిమాతో ఆమె పాపులర్ అయ్యారు. అయితే మా నాన్న గారికి అవకాశాలు లేక కచేరీలు చేసుకున్నారు అనే కామెంట్లు అప్పట్లో ఎక్కువగా వినిపించాయి.
కానీ అందులో నిజం లేదు. ఆయన ఇండస్ట్రీని వీడిన టైంలో కూడా ఆయనకి ఎక్కువ అవకాశాలే ఉన్నాయి. కానీ (Director) డైరెక్టర్ శ్రీధర్ తో జరిగిన ఓ గొడవ కారణంగా నాన్నగారు ఇండస్ట్రీని వదిలేసారు. జీవితంలో మళ్ళీ సినిమాల వైపు చూడకుండా కచేరీలు చేసుకోవాలని ఆయన డిసైడ్ అయ్యారు. అప్పటి స్టార్ హీరోలంతా రిక్వెస్ట్ చేసినా ఆయన తన ఆత్మగౌరవానికే విలువ ఇచ్చారు” అంటూ ఆమె చెప్పుకొచ్చారు హేమలత.