Dulquer Salmaan: వెంకీ అట్లూరి డైరెక్షన్లో దుల్కర్ లక్కీ భాస్కర్… పోస్టర్ వైరల్!

మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వివిధ భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన తెలుగులో సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా ఈయనకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఈయనకు తెలుగు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. తాజాగా ఈయన మరొక తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది.

టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ కూడా ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేయగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నమ్మశక్యంకాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథగా ఈ చిత్రం రూపొందుతోందని ప్రకటన సందర్భంగా చిత్ర నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి ఇందులో హీరోయిన్ ఎవరు అనే విషయం త్వరలోనే తెలియనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఇదివరకే వచ్చినటువంటి సార్ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా (Dulquer Salmaan) తెలుగు తమిళ భాషలలో ఎంతో మంచి ఆదరణ పొందింది. అయితే లక్కీ భాస్కర్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయునన్నారు.

బ్రో సినిమా రివ్యూ & రేటింగ్!

‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!
‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus