‘ఓకె బంగారం’ ‘మహానటి’ ‘కనులు కనులను దోచాయంటే’ ‘కురుప్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్.ఇటీవల విడుదలైన ‘సీతారామం’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకుని ఇక్కడ కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. మొదటి వారానికే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ‘సీతా రామం’ సక్సెస్ పై దుల్కర్ సల్మాన్ పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.
దుల్కర్ ఓ లెటర్ ద్వారా స్పందిస్తూ.. “తెలుగు ప్రేక్షకులకు నేనెప్పుడూ రుణ పడి ఉంటాను.నా ఫస్ట్ మూవీ ‘ఓకే బంగారం’ నుండి మీరు నాపై చూపిస్తున్న ప్రేమ వెలకట్టలేనిది. ఈ అవకాశం ఇచ్చిన మణిరత్నం గారికి థ్యాక్స్. అలాగే ‘మహానటి’లో ‘జెమిని గణేశన్’ పాత్ర ని ఇచ్చి తెలుగు అభిమానులకు నన్ను మరింత దగ్గర చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ కు, ‘వైజయంతి మూవీస్’ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఎక్కడికి వెళ్లినా ‘అమ్మాడి’ అనే పాత్ర నా జీవితంలో నిలిచిపోతుంది.
అటు తర్వతా ‘కనులు కనులు దొచాయంటే’, ‘కురుప్’ సినిమాలపై కూడా మీరు చూపించిన ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోను.స్వప్న గారు,హను రాఘవపూడి గారు ఈ కథతో నా వద్దకు వచ్చారు. కథ విన్న వెంటనే నేను ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాను. చాలా కొత్తగా ఈ కథను రాసుకున్నారు హను. ఇలాంటి కథలతో వస్తే నేను డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయడానికి రెడీ. మూస పద్ధతిలో వెళ్తున్న ఇండస్ట్రీకి కొత్త దారి చూపించారు.
సీతారామంలో చాలా మంది గొప్ప గొప్ప నటీనటులు నటించారు. ఈ విజయం ప్రతి ఒక్కరిదీ. ఈ సినిమా రిలీజ్ రోజు నేను ఏడ్చాను.. ఎందుకంటే ప్రేక్షకులు ఈ మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. హను రాఘవపూడి, మృణాల్, రష్మిక, సుమంత్ అన్న, విశాల్, పీఎస్ వినోద్ వంటి వారికి ఎలా థాంక్స్ చెప్పాలో నా దగ్గర మాటలు లేవు. చివరిగా సినిమాని, కళను ఇంత గొప్పగా ప్రేమించే తెలుగు ప్రేక్షకులు నన్ను సొంత వాడిగా ఆదరించడం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇట్లు మీ రామ్” అంటూ దుల్కర్ సల్మాన్ రాసుకొచ్చాడు. అలాగే నిర్మాత అశ్వనీదత్ కి కూడా స్పెషల్ థాంక్స్ చెప్పారు.