Dulquer Salmaan:వరుసగా అతిథి పాత్రల్లో స్టార్‌ హీరో? కెరీర్‌కు మంచిదేనా?

కొంతమంది హీరోలు ఉంటారు. ఎవరూ ఊహించని పాత్రలు చేస్తూ వైవిధ్యం ఉన్న నటులు అనిపించుకుంటూ ఉంటారు. మరికొంతమంది నటులు ఉంటారు.. స్టార్‌ హీరోగా స్టేటస్ ఉన్న రోజుల్లోనే గెస్ట్‌ పాత్రలు చేస్తూ ఉంటారు. ఎందుకు అలాంటి పాత్రలు చేస్తారు, వాళ్ల లెక్కేంటి అనే డౌట్స్‌ వస్తూనే ఉంటాయి. తెలుగులో ఇలా హీరో పాత్రలు చేస్తూ గెస్ట్‌ రోల్స్‌, కీ రోల్స్‌, కేమియోలు అంటూ చిన్న చిన్న పాత్రలు చేసేవారిలో రానా ఒకడు. ఇప్పుడు అలాంటి స్టైల్‌లో మరో హీరో వచ్చి చేరాడు.

అయితే అతను టాలీవుడ్ నుండి కాదు, మాలీవుడ్‌ నుండి. టాలీవుడ్‌ లేటెస్ట్ సినిమాల అప్‌డేట్లు, పుకార్లు మీరు ఫాలో అవుతున్నట్లయితే ఆ హీరో దుల్కర్‌ సల్మాన్‌ అని ఈజీగా చెప్పేస్తారు. ఎందుకంటే ఇటీవల కాలంలో సౌత్‌లో ఇలాంటి పాత్రలకు ఆయన ఠక్కున ఓకే చెప్పేస్తున్నారు కాబట్టి. మొన్నటికి మొన్న కమల్‌ హాసన్‌ సినిమాను ఓకే చేసిన దుల్కర్‌ (Dulquer Salmaan) ఇప్పుడు మరో సినిమాను ఓకే చేశాడు అని అంటున్నారు. ఆ సినిమా బాలకృష్ణది అని టాక్‌.

ఈ సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు బాబి. ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నారు. నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలు ప్రారంభించుకుంది. ఈ క్రమంలో సినిమా నుండి ఓ ఆసక్తికర రూమర్‌ బయటకు వచ్చింది. దాని ప్రకారం చూస్తే… ఈ సినిమాలో కీలక పాత్ర కోసం దుల్కర్‌ సల్మాన్‌ను సంప్రదించారట. ఆయన కూడా సుముఖంగా ఉన్నారని టాక్‌.

ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు క్లియర్‌ చేసే ఆలోచనలో ఉన్నాడట బాలయ్య. ఏపీలో ఆ సమయానికి ఎన్నికల ఫీవర్‌ ఉంటుంది కాబట్టి… సినిమా పూర్తి చేసి అటు వెళ్లిపోదాం అనుకుంటున్నారట. ఈ క్రమంలో కాస్టింగ్‌ విషయంలో త్వరపడుతున్నారు. ఆ విషయం పక్కనపెడితే దుల్కర్‌ ఇలా ఎందుకు చిన్న పాత్రలకు ఓకే చెబుతున్నాడో ఆయనకే తెలియాలి.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus