మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) తనయుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) మలయాళంలో కంటే టాలీవుడ్ లోనే మంచి హిట్స్ అందుకుంటున్నారు. యాక్టింగ్ టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన ఆయన, కోలీవుడ్, టాలీవుడ్‌లో కూడా తనకంటూ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. తెలుగులో దుల్కర్ తొలిసారి ‘మహానటి’ (Mahanati) మూవీలో జెమినీ గణేషన్ పాత్రతో మెప్పించి, మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ‘సీతారామం’లో (Sita Ramam) లవర్ బాయ్ రోల్ చేసి మరింత అభిమానులను సంపాదించుకున్నారు.
Dulquer Salmaan
తాజాగా టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘కల్కి 2898 ఎడీ’ (Kalki 2898 AD) లో గెస్ట్ రోల్ చేసి, తన హవాను కొనసాగిస్తున్నారు. ఇక రీసెంట్‌గా ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, మిడిల్ క్లాస్ బ్యాంక్ ఉద్యోగిగా దుల్కర్ చేసిన పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో, టాలీవుడ్‌లో దుల్కర్‌కు 100% హిట్ రేట్‌గా నిలిచారు.
దుల్కర్ (Dulquer Salmaan) నటించిన తెలుగు సినిమాలు ‘మహానటి’, ‘సీతారామం’, ‘కల్కి’, ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’తో పక్కా హిట్ రికార్డు కొనసాగుతున్నారు. ఈ సక్సెస్‌తో దుల్కర్‌కి టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తోంది. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో విడుదలై కేరళలో కూడా బాగా ఆడుతోంది. మొదటిరోజే అక్కడ రూ.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విషయం. ఒక రకంగా సినిమాపై ఊహించిన రేంజ్ లోనే బిజినెస్ జరిగింది.
ఫైనల్ గా ఈ విజయంతో దుల్కర్ సొంత గడ్డపై మరో లెవెల్లో తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు. అది కూడా తెలుగు నుంచి వచ్చిన సినిమా కావడం విషయం. ఇకపోతే, ప్రస్తుతం తెలుగులో దుల్కర్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో దుల్కర్ తెలుగు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.