ప్రతి పండక్కీ నాలుగైదు సినిమాలు పోటీపడడం అనేది సర్వసాధారణం. ఈ దీపావళికి వేర్వేరు భాషల నుండి ఏకంగా 8 సినిమాలు విడుదలయ్యాయి. తెలుగు నుంచి “క, లక్కీ భాస్కర్”, తమిళం నుండి “అమరన్, బ్రదర్, బ్లడీ బెగ్గర్”, కన్నడ నుండి “బఘీర”, హిందీ నుండి “సింగం ఎగైన్, భూల్ భులయ్యా 3” విడుదల కాగా.. తెలుగునాట “బ్రదర్, బ్లడీ బెగ్గర్” విడుదలవ్వలేకపోయాయి. సో, ఇక్కడ విడుదలైన 6 సినిమాలు ఎలా ఉన్నాయి? వాటి రివ్యూలు ఏమిటో చూడండి.
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కమ్ బ్యాక్ సినిమా ఇది. సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రీట్మెంట్ & క్లైమాక్స్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మ్యూజిక్ & ఎడిటింగ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) టైటిల్ పాత్రలో వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో నాగవంశీ (Suryadevara Naga Vamsi ) నిర్మించిన చిత్రం “లక్కీ భాస్కర్”. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం స్క్రీన్ ప్లే & రైటింగ్ ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచింది అనే చెప్పాలి. ఈమధ్యకాలంలో ఈస్థాయి షార్ప్ రైటింగ్ ను చూడలేదు. దుల్కర్ నటన, వెంకీ అట్లూరి రైటింగ్ కోసం ఈ సినిమాను కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే.
శివకార్తికేయన్ (Sivakarthikeyan) -సాయిపల్లవి (Sai Pallavi) జంటగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి (Rajkumar Periasamy) దర్శకుడు. 2014లో ఓ ఆపరేషన్ లో ప్రాణాలు విడిచిన ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఎమోషనల్ గా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సాయిపల్లవి నటన సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి.
ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కథ అందించగా డా.సూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శ్రీమురళి హీరోగా నటించాడు. కామన్ మ్యాన్ సూపర్ హీరోగా మారి అన్యాయాన్ని ఎలా ఎదిరించాడు అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం యాక్షన్ బ్లాక్ మాత్రం ఓ మోస్తరుగా ఆకట్టుకోగలిగాయి.
రీసెంట్ గా తెలుగులో వచ్చిన ఓ హారర్ కామెడీని గుర్తిచేసిన ఈ చిత్రం కంటెంట్ & క్వాలిటీ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) , మాధురి దీక్షిత్ (Madhuri Dixit), , విద్యాబాలన్న్ (Vidya Balan) ల కాంబినేషన్ అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. పండక్కి బాలీవుడ్ కి మంచి బాక్సాఫీస్ దగ్గర మంచి కిక్ ఇచ్చే సినిమాగా నిలుస్తుంది చిత్రం.
మిగతా రెండు తమిళ సినిమాలు “బ్రదర్, బ్లడీ బెగ్గర్” బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. జయం రవి, కవిన్ మాత్రమే ఈ దీపావళికి ఫ్లాప్ చవిచూడాల్సి వచ్చింది. “బఘీర” కనీసం కన్నడలో ఆడుతుంది. మీరు ఈ దీపావళికి ఏ సినిమాకి వెళ్తున్నారు.