టాలీవుడ్‌లో హీరో – ప్రొడ్యూసర్ మధ్య గురు శిష్యుల బంధం ఉన్నవాళ్ల లిస్ట్ రాస్తే.. చిరంజీవి, దానయ్య ఆ లిస్ట్‌లో కచ్చితంగా ఉంటారు. ఎందుకు కుదిరిందో, ఎలా కుదిరిందో తెలియదు కానీ.. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. దానయ్య సినిమా ఓపెనింగ్ అవుతుంది అంటే చిరంజీవి కచ్చితంగా వస్తారు. అలా వచ్చినప్పుడు దానయ్య అతనిని గురు సమానంగా చూసుకుంటూ ఉంటారు. అయితే ఈ చర్చ అంతా ఎందుకు అంటే దానయ్య వెనుక చిరంజీవి ఉండి.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ నడిపించారు అనే చర్చ రావడమే.
దానయ్య నిర్మాణంలో రాజమౌళి సినిమా అనేసరికి.. ఒక్కసారి అందరి చూపు డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌వైపు వెళ్లాయి. అనుకున్నట్లుగానే దానయ్య సుమారు రూ. 450 కోట్లతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా తీశారు. ఆ సినిమా ఆస్కార్ వరకు వెళ్లి ఓ పురస్కారం కూడా సాధించింది. ఇక సినిమా వసూళ్ల లెక్క అంటారా? రూ. 1200 కోట్లు దాటిపోయింది అని చెప్పాలి. అయితే, ‘RRR’ సినిమా నిర్మాణంలో చిరంజీవి భాగస్వామి అని.. ఆయన పెట్టుబడులు పెట్టారని ఓ యూట్యూబ్ ఛానెల్ వార్తలు పబ్లిష్ చేసింది.
దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ వైరల్ వార్తలపై తాజాగా డీవీవీ దానయ్య స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్‌లో వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలని, చిరంజీవి తన సినిమాకు పెట్టుబడి పెట్టలేదని స్పష్టం చేశారు. తాను ఫైనాన్షియర్ల దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చి సినిమాలో పెట్టానని తేల్చి చెప్పేశారు. ‘‘చిరంజీవి మా సినిమాలో పెట్టుబడి పెట్టడమేంటి. ఆయనకేం సంబంధం. నా పెట్టుబడి అంతా నా ఫైనాన్షియర్లు పెట్టారు’’ అని క్లారిటీ ఇచ్చారు దానయ్య.
‘‘ఏ నిర్మాత అయినా కొంత వరకు డబ్బులు పెట్టుబడి పెడతారు. కొంత మొత్తం ఫైనాన్షియర్ల దగ్గర తీసుకుంటారు. వడ్డీకి డబ్బులు ఇస్తారు, రిలీజ్ అప్పుడు తిరిగి కట్టేస్తారు. నేనూ అంతే చేశాను. చిరంజీవి డబ్బులు పెట్టారు అని నా ఆఫీసుకొచ్చి చూసినట్టు, నా అకౌంట్లు చూసినట్టు, నా బ్యాంక్ స్టేట్‌మెంట్ చూసినట్టు చెప్పారు. ఇదంతా సరికాదు. ఈ మాటలు ఎవరు మాట్లాడారో నాకు తెలియదు. అలా చెప్పిన వాళ్లు నా దగ్గరకు వస్తే ఇంకా క్లారిటీ ఇస్తా’’ అని చెప్పారు దానయ్య.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?