రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగల్ మూవీ రిలీజ్ కు మరో 72 గంటల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు బుకింగ్స్ మొదలయ్యాయి. హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్లలో ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ప్రమోషన్స్ లో వేగం పెంచితే ఈ సినిమాకు బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. దిల్ రాజు మాట ఇచ్చిన విధంగా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా విడుదలవుతోంది.
ఈ వారం ఎన్ని సినిమాలు విడుదలవుతున్నా ఈగల్ (Eagle Movie) సినిమాపైనే ఎక్కువ అంచనాలు ఏర్పడ్డాయి. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ట్రైలర్ లో రివీల్ చేయని అంశాలు ఎక్కువగానే ఉన్నాయని పత్తి రైతుల కష్టాల గురించి ఈ సినిమాలో ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. రవితేజ కూడా రైతుగా కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజకు ఆ రేంజ్ సక్సెస్ దక్కలేదు. ఈ సినిమా ఆ లోటును భర్తీ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కారీక్ ఘట్తమనేని ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాస్ మహారాజ్ సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయని సమాచారం అందుతుండటం గమనార్హం.
రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మిస్టర్ బచ్చన్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ కాంబోలో తెరకెక్కిన మిరపకాయ్ హిట్ కాగా మిస్టర్ బచ్చన్ అంతకు మించి ఉంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మిస్టర్ బచ్చన్ కు ఫస్ట్ లెటర్ విషయంలో మిరపకాయ్ సెంటిమెంట్ ను ఫాలో అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మాస్ మహారాజ్ రవితేజకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!