తెలుగమ్మాయి ఈషా రెబ్బా అందరికీ సుపరిచితమే. 2012 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అంతకుముందు ఆ తర్వాత’ చిత్రంతో హీరోయిన్ గా మారింది. అది సక్సెస్ అవ్వడంతో ‘బందిపోటు’ ‘అమీ తుమీ’ ‘దర్శకుడు’ ‘అ!’ ‘బ్రాండ్ బాబు’ ‘అరవింద సమేత వీర రాఘవ’ ‘సుబ్రహ్మణ్యపురం’ ‘రాగల 24 గంటల్లో’ వంటి సినిమాల్లో నటించింది.
అలాగే పలు వెబ్ సిరీస్లలో, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఇక అక్టోబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘మామా మశ్చీంద్ర’ సినిమాలో కూడా ఆమె ఓ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె కొన్ని ఊహించని కామెంట్లు చేసింది. ఈషా రెబ్బా మాట్లాడుతూ.. ” రూమర్స్, గాసిప్స్ అనేవి ఏ నటీనటులకైనా కామన్. కానీ కొన్ని సార్లు అవి పెద్ద దెబ్బ కొడతాయి అని నాకు తెలిసొచ్చింది.
విషయం ఏంటంటే.. నా పారితోషికం విషయంలో చాలా వార్తలు వినిపిస్తూ ఉంటాయి.వాటి వల్ల కొన్ని మంచి పాత్రలు నేను మిస్ అయ్యాను. నాకు నచ్చితే ఎలాంటి పాత్రైనా చేస్తాను. రూ.2 , రూ.10 .. కి అయినా నేను నటించడానికి రెడీ. నేను కోల్పోయిన మంచి పాత్రల గురించి ఈ విషయం నాకు ఆలస్యంగా తెలిసొచ్చింది” అంటూ వాపోయింది (Eesha Rebba) ఈ బ్యూటీ.