Nandamuri Mokshagna: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి అవే హైలెట్.. బాక్సాఫీస్ షేక్ అవుతుందంటూ?

నందమూరి మోక్షజ్ఞకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) మనవడు, బాలయ్య (Balakrishna)   కొడుకు కావడంతో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీతోనే సంచలనాలు సృష్టిస్తాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒక జర్నలిస్ట్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) రాసిన స్క్రిప్ట్ గురించి తెలిసి ఈ స్క్రిప్ట్ లో హైలెట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెబుతున్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీతోనే బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రశాంత్ వర్మ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయడం పక్కా అని ప్రముఖ జర్నలిస్ట్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని తెలుస్తోంది. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబో నెక్స్ట్ లెవెల్ కాంబో అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం నందమూరి ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

వచ్చే ఏడాది థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. హనుమాన్ సక్సెస్ తో ప్రశాంత్ వర్మ సైతం పాన్ ఇండియా డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. ప్రశాంత్ వర్మ పారితోషికం సైతం భారీ స్థాయిలో పెరగగా ఈ దర్శకుడు కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో సైతం ఉంది.

మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబో మూవీ అధికారిక అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది స్పెషల్ సినిమాలలో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీనే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus