2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ఎఫ్2’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘వినయ విధేయ రామ’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి బడా సినిమాల నడుమ విడుదలైన ఈ చిత్రం.. వాటిని తలదన్ని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. 32 కోట్లకు ‘ఎఫ్2’ చిత్రానికి అమ్మకాలు జరుగగా.. ఫుల్ రన్లో ఏకంగా 80కోట్ల షేర్ ను వసూల్ చేసింది ఆ చిత్రం. ఇక ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘ఎఫ్3’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుణ్ తేజ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
మరో హీరో వెంకటేష్ కూడా అతి త్వరలో.. ‘ఎఫ్3’ షూట్లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ‘ఎఫ్3’ షూటింగ్ సగం కూడా పూర్తవ్వకుండానే 40కోట్ల ప్రాఫిట్ దక్కించుకుందనేది తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే.. ‘ఎఫ్3’ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కాబోతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘ఎఫ్3’ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ మరియు డబ్బింగ్ రైట్స్.. కలుపుకుని 40కోట్ల డీల్ వచ్చిందట. అయితే దర్శక నిర్మాతలు ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని వినికిడి.
కానీ వాళ్ళు ఈ ఆఫర్ కు ఓకే చెప్పేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఇక ‘ఎఫ్3’ ని 50కోట్ల బడ్జెట్ లో ఫినిష్ చెయ్యాలని దర్శకుడు అనిల్ తో దిల్ రాజు ఎప్పుడో ఒప్పందం చేసుకున్నారు. ఆ రకంగా చూస్తే ‘ఎఫ్3’ కూడా మంచి లాభాలను మిగిల్చే సినిమా అవుతుందేమో..!