వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. 2019 లో వచ్చిన ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు నిర్మించారు. సోనాల్ చౌహాన్ ,మురళీ శర్మ, సునీల్, అలీ, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉండడంతో మొదటినుండీ ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక మే 27న విడుదలైన ఈ మూవీ మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మంచి ఓపెనింగ్స్ కూడా నమోదయ్యాయి. కానీ తర్వాత కొత్త సినిమాల ఎంట్రీతో ‘ఎఫ్3’ జోరు తగ్గింది. అయినప్పటికీ కొంత మేర ఓకే అనిపించినా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ఒకసారి ‘ఎఫ్ 3’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
18.37 cr
సీడెడ్
6.20 cr
ఉత్తరాంధ్ర
6.29 cr
ఈస్ట్
3.39 cr
వెస్ట్
2.52 cr
గుంటూరు
3.38 cr
కృష్ణా
2.96 cr
నెల్లూరు
1.78 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
44.89 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
3.10 cr
ఓవర్సీస్
7.21 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
55.20 cr
‘ఎఫ్3’ మూవీ కి రూ.63.82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.64 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.55.2 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్స్ కు బిజినెస్ పై రూ.8.62 కోట్ల నష్టం వాటిల్లినట్లు అయ్యింది. అయినప్పటికీ ఈ మూవీ అబౌవ్ యావరేజ్ గా నిలిచింది అని చెప్పాలి.
పోటీగా ‘మేజర్’ ‘విక్రమ్’ వంటి కొత్త సినిమాలు రిలీజ్ కాకుండా ఉండి ఉంటే ఈ మూవీ ఇంకా బాగా కలెక్ట్ చేసి ఉండేది. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు కూడా ఉండేవి.